AP Crime News

AP Crime News:గుర్తు తెలియ‌ని మ‌హిళ ట్రైన్ కింద ప‌డి ఆత్మ‌హ‌త్య‌!

Spread the love

AP Crime News: కుప్పం: ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ (45) ట్రైన్ కింద ప‌డి ఆత్మ‌హ‌త్య(suicide) చేసుకున్న సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా కుప్పంలో గురువారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై బ‌ల‌రాం తెలిపిన వివ‌రాల మేర‌కు.. బెంగ‌ళూరు – చెన్నై రైలు (chennai-bengaluru train route)మార్గంలో డీకేప‌ల్లి రైల్వే గేటు వ‌ద్ద గుర్తు తెలియ‌ని మ‌హిళ రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని, ఆమె ఎడ‌మ చేతిపై జీ.మునెమ్మ అని ప‌చ్చ‌బొట్టు ఉంద‌ని తెలిపారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శ‌వాన్ని కుప్పం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఆయ‌న(AP Crime News) తెలిపారు.

తిరుప‌తిలో 5 ల‌క్ష‌ల విలువైన గుట్కాలు స్వాధీనం

తిరుప‌తి: న‌గ‌రంలో భారీగా గుట్కా ప్యాకెట్లు ల‌భ్య‌మ‌య్యాయి. స‌త్యనారాయ‌ణ‌పురం అన్న‌మ‌య్య న‌గ‌ర్‌లో ఉన్న గుట్కా స్థావ‌రంపై అలిపిరి(Alipiri) పోలీసులు గురువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.5 ల‌క్ష‌ల విలువైన 49 సంచులు, 25 అట్ట బాక్సుల్లో ఉంచిన గుట్కాలు స్వాధీనం చేయ‌బ‌డ్డాయి. క‌ర్ణాట‌క రాష్ట్రం నుంచి ర‌వాణా చేస్తూ తిరుప‌తిలో అధిక రేట్ల‌కు అమ్ముతున్నారు. ప‌ట్టుబ‌డిన వ్య‌క్తి కె.వెంక‌టేష్‌గా పోలీసులు గుర్తించారు. అత‌నిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు అలిపిరి ఎస్ఐ ఇమ్రాన్ భాష తెలిపారు.

Tirupati Urban Sp: భ‌య‌ప‌డే సంఘ‌ట‌న‌లు ఏమీ జ‌ర‌గ‌లేదు..అదుపులో శాంతి భ‌ద్ర‌త‌లు

Tirupati Urban Sp తిరుప‌తి: స్థానిక నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు పై వార్షిక బులెటిన్ ను పత్రికా ముఖంగా Read more

AP crime news: ఫ్యామిలీ మెంబ‌ర్ స‌ర్టిఫికెట్ కు 3 ల‌క్ష‌లు డిమాండ్‌.. ఏసీబీ వ‌ల‌లో చిక్కిన డిప్యూటీ త‌హ‌శీల్దార్‌!

AP crime newsవిశాఖ‌పట్నం: ఏపీలో లంచం లేనిది ప‌ని జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ ఏడాదిలో ఏసీబీఓ వ‌ల‌లో చిక్కిన అధికారుల్లో ఎక్కువుగా రెవెన్యూ శాఖ‌కు Read more

Sex Racket On Whatsapp: మ‌న ద‌గ్గ‌ర బేరాల్లేవ‌మ్మా! కాక‌పోతే అన్నీ వాట్సాప్‌లోనే రేటు ఫిక్స్‌!

Sex Racket On Whatsapp: తిరుప‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక న‌గ‌ర‌మైన తిరుప‌తి ప‌ట్ట‌ణంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్య‌భిచార దందా గుట్టును పోలీసులు Read more

Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమాన‌స్ప‌ద మృతి

Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమాన‌స్ప‌ద మృతి Suicide: తిరుప‌తిలో చైత‌న్య కాలేజీలో ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థిని అనుమాన‌స్ప‌దంగా మృతి చెందిన సంఘ‌ట‌న ముత్యాల‌రెడ్డి ప‌ల్లి పోలీస్ Read more

Leave a Comment

Your email address will not be published.