AP crime newsవిశాఖపట్నం: ఏపీలో లంచం లేనిది పని జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాదిలో ఏసీబీఓ వలలో చిక్కిన అధికారుల్లో ఎక్కువుగా రెవెన్యూ శాఖకు సంబంధించిన వారే ఉండటం గమనర్హం. తాజాగా ఏసీబీ వలలో విశాఖ పట్టణం జిల్లా మహారాణి పేట మండల డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీ వలకు(AP crime news) పట్టుబడ్డారు.
ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన డిప్యూటీ తాశీల్దార్ బి.రవి కుమార్ సదరు వ్యక్తి నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. అయితే అడ్వాన్స్‌గా రూ.60,000 ఇవ్వడానికి బాధితురాలు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే ఏసీబీకి బాధితురాలు యన్. అన్నపూర్ణ తెలియజేశారు. సోమవారం సాయంత్రం డిటిని సాక్ష్యాధారాలతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తిరుపతిలో యాత్రికుడు ఆత్మహత్యాయత్నం


తిరుపతిలో ఓ యాత్రికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కర్నాల వీధిలోని వైభవ్ రెసిడెన్సీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. విశాఖపట్నంకు చెందిన అరవింద్ గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 7వ తేదీన భార్యాభర్తలు ఇరువురు రూం నెంబర్ 211లో బస చేశారు. అనంతరం తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. మూడు రోజుల తర్వాత అరవింద్ ఒక్కడే రూం నెంబర్ 104లో తిరిగి బస చేశాడు. అయితే ఆదివారం కత్తితో చేయి కోసుకుని అపస్మారక స్థితిలో ఉన్న అతడిని రూమ్ బాయ్ గమనించి యజమాన్యానికి చెప్పాడు. వారు ఈస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?