Meeting agenda

Meeting agenda: పూర్వ వైభ‌వం రావాలంటే ఏం చేద్ధాం.. విశాఖ న‌గ‌రాన కాంగ్రెస్ మ‌హిళ విభాగం మీటింగ్!

Spread the love

Meeting agenda: విశాఖ‌ప‌ట్ట‌ణం: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం తీసుకురావ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ మ‌హిళా ఇంఛార్జి అధ్య‌క్షురాలు కె.ప్ర‌మీల‌మ్మ అన్నారు. విశాఖ న‌గ‌ర మ‌హిళా అధ్య‌క్షురాలు దేవ‌ర నాగ సునందా దేవి ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం న‌గ‌ర కాంగ్రెస్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశం(Meeting agenda)లో ఆమె మాట్లాడారు.

రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు మితిమీరిపోతున్నాయ‌ని, న‌ష్ట ప‌రిహారాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా శాశ్వ‌త ప‌రిష్కారంపై ఆలోచించాల‌న్నారు. హ‌త్య‌లు, అత్యాచారాలు అరిక‌ట్టాలంటే కేవ‌లం క‌ఠిన శిక్ష‌లు, న‌ష్ట ప‌రిహారాలే మార్గం కాద‌ని, జులాయిగా తిరిగే ఆక‌తాయిలు, నేర చ‌రిత్ర ఉన్న‌వారితో పాటు వారికి అండ‌గా ఉన్న‌వారిపై కూడా ప్ర‌త్యేక దృష్టి సారిరించాల‌ని బైండోవ‌ర్ కేసులు పెట్టాల‌ని తెలిపారు.

కాంగ్రెస్ ప్ర‌జ‌ల పార్టీ అని పార్టీ సిద్ధాంతాల‌తో అన్ని స్థాయిల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వానికి ప్ర‌తి కార్య‌క‌ర్తా కృషి చేయాల‌ని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ హ‌యాంలో కూడ‌బెట్టిన ప్ర‌జ‌ల సంప‌ద‌, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను కార్పొరేట్ సంస్థ‌ల‌కు దారాద‌త్తం చేస్తూ ఖ‌జానా నింపుకునే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ల‌పై ఆమె మండి ప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌థ‌కాల పేరుతో కూడిచేతితో ఆడ‌వాళ్ల‌కు రూ.10 వేలు ఇచ్చి, మ‌గ‌వారి జేబులు ఖాళీ చేస్తోంద‌న్నారు. ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు మానుకోక‌పోతే ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌న్నారు. అనంత‌రం మ‌హిళా విభాగం నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశానికి హాజ‌రైన మ‌హిళా నాయ‌కురాళ్లు పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. స‌మావేశంలో అన‌కాప‌ల్లి అధ్య‌క్షురాలు సూర్య‌కుమారి, విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షురాలు ఎస్‌. ల‌క్ష్మి, శ్రీ‌కాకుళం మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు ఈశ్వ‌రి, శ్రీ‌కాకుళం మ‌హిళా విభాగం అధ్యక్షురాలు ఈశ్వ‌రి, రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు ర‌జియా బేగం, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఎమ్‌.స్వ‌ర్ణ‌, ప‌ర‌మేశ్వ‌ర‌మ్మ‌, కార్య‌ద‌ర్శి మాధురి, న‌గ‌ర మ‌హిళా క‌మిటీ ఉపాధ్య‌క్షురాలు పార్వ‌తి, కార్య‌ద‌ర్శి అప్రోజ్ మ‌రియు వ‌రాల‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

AP crime news: ఫ్యామిలీ మెంబ‌ర్ స‌ర్టిఫికెట్ కు 3 ల‌క్ష‌లు డిమాండ్‌.. ఏసీబీ వ‌ల‌లో చిక్కిన డిప్యూటీ త‌హ‌శీల్దార్‌!

AP crime newsవిశాఖ‌పట్నం: ఏపీలో లంచం లేనిది ప‌ని జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ ఏడాదిలో ఏసీబీఓ వ‌ల‌లో చిక్కిన అధికారుల్లో ఎక్కువుగా రెవెన్యూ శాఖ‌కు Read more

Sileru River : విశాఖ‌లో ఏవోబీలో విషాదం రెండు నాటు ప‌డ‌వ‌లు బోల్తా!

Sileru River : విశాఖ‌ప‌ట్ట‌ణం ఏవోబీ(ఆంధ్రా - ఒడిశా బోర్డ‌ర్‌) లో మంగ‌ళ‌వారం విషాదం చోటు చేసుకుంది. సీలేరు న‌దిలో రెండు నాటు ప‌డ‌వ‌లు బోల్తా ప‌డి Read more

Covid పేషెంట్ల ప్రాణాల‌తో చెల‌గాటం! Remdesivir Injection రూ.10వేల‌కు బ్లాక్ మార్కెట్‌లో!

Covid పేషెంట్ల ప్రాణాల‌తో చెల‌గాటం! Remdesivir Injection రూ.10వేల‌కు బ్లాక్ మార్కెట్‌లో! Remdesivir Injection : దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరిగి ప్ర‌భుత్వాలు అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే మ‌రో Read more

Pendurthi Murdered : వ‌రుస హ‌త్య‌ల‌తో ఉలిక్కిప‌డ్డ‌ విశాఖ‌! | Six of a family brutally murdered

Pendurthi Murdered : వ‌రుస హ‌త్య‌ల‌తో ఉలిక్కిప‌డ్డ‌ విశాఖ‌! | Six of a family brutally murdered Pendurthi Murdered : విశాఖ‌ప‌ట్ట‌ణం : విశాఖ Read more

Leave a Comment

Your email address will not be published.