Scheme : Sunna vaddi నగదును జమచేసిన ఏపీ సీఎం!
Scheme : Sunna vaddi అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు మరోసారి పెద్ద పీఠ వేసినట్టు అయ్యింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సున్నా వడ్డీ నగదును సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1.02 కోట్ల మందికిపైగా పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందని జగన్ అన్నారు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా చెల్లించిందన్నారు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ నగదును జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డామని అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడుతూ వస్తున్నామ న్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని, డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగా అక్కాచెల్లెమ్మలకు వ్యాపార పరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు.


నామినేటెడ్ పోస్టుల్లో పెద్ద పీఠ!
భారత దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా మహిళలకు 50 శాతం నామినేటేడ్ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి రక్షణ విషయంలో ఎక్కడా కూడా రాజీలేని కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. మహిళల తరపున కేసులు వాదించేందుకు ప్రత్యేక పీపీలను నియమించామని సీఎం జగన్ అన్నారు. 900 కొత్త వాహనాలను కొనుగోలు చేశామని, మద్యం నియంత్రణ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం తెలిపారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court