AP Assembly Budget 2022-23 | ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైయ్యాయి. ఏపీలోని సభ ప్రారంభంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉభయ సభలను ఉద్ధేశించి మాట్లాడారు. కరోనా తగ్గిన తర్వాత తొలిసారిగా ఉభయ సభలకు గవర్నర్ హాజరయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే వర్చువల్గా ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి (AP Assembly Budget 2022-23)నెలకొంది.
ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభమయ్యాయి. బీజేపి నుంచి గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ తొలిసారిగా అసెంబ్లీకి హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి టి.హరీష్రావు ప్రసంగిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో నిరసన వ్యక్తం చేశారు.

గవర్నర్ గో బ్యాక్ అంటూ..
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గో బ్యాక్ అంటూ టిడిపి సభ్యులు నినాదాలు చేశారు. ఏపీలో తొలిరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలైంది. ప్రసంగం కొనసాగుతుండగానే టిడిపి సభ్యులు అడ్డుతగిలి పెద్ద పెద్దగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అదే విధంగా గవర్నర్ ప్రతులను టిడిపి సభ్యులు చించివేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. టిడిపి సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. టిడిపి ఎమ్మెల్యేల తీరుపై సీఎం వైఎస్.జగన్ అసహనం వ్యక్తం చేశారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ