Annamayya Keerthanalu | నానాదిక్కుల నరులెల్లా
వానలలోననె వత్తురు గదలి
సతులు సుతులుబరిసరులు బాంధవులు
హితులు గొలువగా నిందరను
శతసహస్ర యోజనవాసులును
వ్రతములతోడనే వత్తురు గదలి
ముడుపులు జాళెలు మొగిదలమూటలు
కడలేని ధనముగాంతలును
కడుమంచిమణులు కరులుదురగములు
వడిగొని చెలుగుచు వత్తురు గదలి
మగుట వర్థనలు మండలేశ్వరులు
జగదేకపతులు జతురులు
తగు వేంకటపతి దరుంశింపంగా బహు
వగల సంపదల వత్తురు గదలి
భక్తజనులందరు బంధువులతో
ముడుపులు, కానుకలతో
చాలా దూరం నుండి శ్రమకోర్చి,
నియమ నిష్ఠలతో
Srivari ఉత్సవాలకు వస్తారు.
సామాన్య ప్రజలే కాదు.
రాజులు, చక్రవర్తులు, సార్వభౌములు,
జగదేకపతులు ఇలాగ
ఒక్కరేమిటి ఆబాల గోపాలం శ్రీ వెంకటేశుని
దర్శించడానికి వానలలోనే కదలివస్తారని
అన్నమయ్య వర్ణించిన కీర్తన ఇది.
Annamayya Keerthanalu | అన్నమయ్య సంకీర్తన
అలుగకువమ్మా! నీవాతనితో నెన్నడను.
పలు వేడుకలతోను పాయకుండరమ్మ అంటూ
మొదలై ఆ Swami ఘనతను దశావతార వర్ణన
సాక్షిగా మనకు సాక్షాత్కరింప జేస్తుంది సంకీర్తన.
జలధితపముజేసె(మత్స్యావతారం) సాధించె పాతాళము (కూర్మావతారం)
నెలత! నీరమణుడు నీకుగానె!
యిలవెల్ల హారించె(వరహావతారం) నెనసెకొండగుహల(నృసింహావతారం)
ఎలిమి నిన్నిటా నీకితవుగానె బాలబొమ్మచారైయుండె(వామనావతారం)
పగలెల్లా సాధించె (పరశురామ అవతారం)
నీ లీలలు దలిచినీకు గానె
తాలిమి వ్రతము బట్టి ధర్మముతో కూడుండె (రామావతారం)
పాలించి నీవు చెప్పిన పనికి గానె…అలుగకువమ్మా..
ఎగ్గుసిగ్గు చూడడాయ (బలరామావతారం)
యెక్కెను శిలాతలము (Krishnavataram)
నిగ్గులనిన్నిటా గూడె నీకు గానె
అగ్గిలపు శ్రీ వేంకటాద్రీశుడై నిల్చె
ఒగ్గి నిన్నురాన మోచి యుండుటకు గానె.. అలుగుకువమ్మా..