Annamayya District | అన్నమయ్య జిల్లా ఎస్పీ యొక్క ఆదేశాల మేరకు మదనపల్లి(madanapalli) తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలోని నార మాకులపల్లి తండా గ్రామంలో సారాపై సమరం ప్రారంభించారు. మదనపల్లి తాలూకా ఇన్ఛార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ మురళి కృష్ణ, ఎస్సైలు చంద్రశేఖర్, మదనపల్లి టూ టౌన్ ఎస్ఐ జి.చంద్రమోహన్, సిబ్బంది 10,000 వేల లీటర్ల నాటుసారా ఊటలను ధ్వంసం చేశారు.
మదనపల్లె పట్టణం(Annamayya District), పరిసర ప్రాంతాలకు నారా మాకులపల్లి తాండ గుట్టలు కేంద్రంగా నాటుసారా కొందరు అక్రమంగా సరఫరా చేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం రావడంతో దాడులు నిర్వహించి నాటుసారా స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి ఇప్పటికే బైండోవర్ చేశామని తమ పద్దతులు మార్చుకోకపోతే పీడీ యాక్ట్ కింద (PD Act)కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రజలు కూడా నాటుసారా గురించి సమాచారం తమకు అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!