Annadammula Banda | చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ బాలపల్లి రేంజ్ రైల్వే కోడూరు మండలంలోని అన్నదమ్ముల బండ(Annadammula Banda) వద్ద అక్రమంగా తరలిస్తున్న 14 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను పసిగట్టి వాడిని పడేసి వెళ్లిన స్మగ్లర్ల(smuggler) కోసం గాలింపు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ సూచనలతో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి (ఏఆర్)కు చెందిన ఆర్ఎస్ఐ సురేష్ బాబు టీమ్ కూంబింగ్ చేపడుతున్నారు. గురువారం నుంచి తిరుపతి అటవీ డివిజన్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
శుక్రవారం ఉదయం అన్నదమ్ముల బండ చేరకునే సమయానికి కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగల(red sandalwood)ను మోసుకొని కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు దుంగలను పడేసి పారిపోయారు. వారి కోసం ఒక టీమ్ గాలిస్తుండగా, ఆ ప్రాంతంలో 14 ఎర్రచందనం దుంగలు లభించాయి. ఈ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసు(task force police station) స్టేషన్లో సిఐ రామకృష్ణ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ