ankamma talli | కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో ముప్పాళ్లమ్మ, అంకమ్మ తల్లి తిరునాళ్లు సోమవారం వైభవంగా జరిగాయి. ఈ తిరునాళ్ల మహోత్సవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ప్రతి ఏడాది జరిగే ఈ తిరునాళ్లతో ముప్పాళ్ల గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అంకమ్మ తల్లి(ankamma talli) భక్తులు తండోపతండాలు విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఇక అంకమ్మ తల్లి తిరునాళ్లకు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్రావు(moditoka jagan mohana rao) పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాకతో వైఎస్సార్సీపీ పార్టీ గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సాదరంగా ఆలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ తిరునాళ్ల మహోత్సంలో ముప్పాళ్ల గ్రామ వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ