anjeer dry fruit benefitsఅంజీరాలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మూడు అంజీరాల నుంచి కనీసం ఐదు గ్రాముల పీచు అందుతుంది. ఇది ఒక రోజుకి అవసరమైన పీచులో 20 శాతాన్ని అందిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఎక్కువ మొత్తంలో పీచూ తక్కువ మొత్తంలో కెలోరీలూ దీన్నూంచి లభిస్తాయి.
1.అంజీరా అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. శరీరంలో సోడియం నిల్వలు పెరిగినప్పుడు సోడియం- పొటాషియం సమతుల్యత దెబ్బతింటుంది. దీన్ని పునరుద్దరిస్తుంది. ఒక ఎండు అంజీరా నుంచి 129 గ్రాముల పొటాషియం రెండు గ్రాముల సోడియం లభిస్తుంది.
2.వీటిల్లో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికారిక వ్యర్థాలను (anjeer dry fruit benefits)తొలగిస్తాయి. గుండెపోటుకు కారణమయ్యే ట్రైగ్లిజరాయిడ్లను తగ్గించేందుకు సాయపడతాయి.
3.ఎండు అంజీరాల్లో అధిక మొత్తంలో ఐరన్ పోషకం లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయుల్ని పెంచుతుంది. రక్త హీనత బారిన పడకుండా కాపాడుతుంది. తగినతంగా మెగ్నీషియం శరీరానికి అందేలా చూస్తుంది.
4.మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువుగా ఉంటుంది. అలాంటి వారు రోజూ అంజీర తీసుకోవడం మంచిది. ఇందులో హిమోగ్లోబిన్ స్థాయుల్ని పెంచే పోషకాలు అధికం. రక్తహీనతా దూరమవుతుంది.

5.బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఎంచుకోవడం మంచింది. కొన్ని ముక్కల్ని భోజనానికి ముందు తీసుకోవడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది. అతిగా తినే సమస్య తగ్గుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.
6.హృద్రోగాలతో బాధపడేవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అంజీర చేర్చుకుంటే మేలు. ఇందులో పెక్టిన్ అనే పదార్థం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. గుండెకూ మేలు చేస్తుంది.
7.సంతానం కోరుకునే వారూ అంజీరను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీసు, జింకు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి