Animator

Animator: యానిమేట‌ర్ చేతివాటం డ్వాక్రా గ్రూపు స‌భ్యుల‌కు టోక‌రా

Andhra Pradesh

Animator | డ్వాక్రా రుణాల(dwakra group) చెల్లింపు వ్య‌వ‌హారంలో ఓ యానిమేట‌ర్ గ్రూపు స‌భ్యుల‌కు టోక‌రా వేసిన‌ట్టు తెలుస్తోంది. గుంటూరు(Guntur) జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం కృష్ణాయ‌పాలెం గ్రామానికి చెందిన 9 డ్వాక్రా సంఘాల‌కు సంబంధించి సుమారు రూ.8 ల‌క్ష‌ల‌ను యానిమేట‌ర్(Animator) స్వాహా చేసిన‌ట్టు స‌మాచారం. సంఘ స‌భ్యులు తీసుకున్న రుణాల‌ను నెల‌నెలా బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తామ‌న‌ని న‌మ్మ‌కంగా తీసుకొని మోస‌గించిన‌ట్టు తెలిసింది. అదేమ‌ని యానిమేట‌ర్ను అడిగితే..అవును డ‌బ్బులు వాడుకున్నా నిదానంగా చెల్లిస్తా, ఎక్కువుగా మాట్లాడితే మీకు చేత‌నైంది చేసుకోమంటూ స‌భ్యుల‌కు తేల్చి చెప్పిన‌ట్టు పలువురు బాధితులు వాపోతున్నారు.

ఈ విష‌యాన్ని వెలుగు సీసీ(velugu cc) దృష్టికి తీసుకువెళితే ఆ డ‌బ్బుల‌కు మాకు సంబంధం లేద‌ని, జ‌రిగిన విష‌యాన్ని మాకెందుకు తెలియ‌జేయ‌లేద‌ని బాధితులైన స‌భ్యుల‌పైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఈ కుంభకోణంలో యానిమేట‌ర్‌తో పాటు సీసీ పాత్ర కూడా ఉంద‌నే అనుమానం క‌లుగుతోంద‌ని ప‌లువురు బాధిత మ‌హిలా సభ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా సంబంధిత ఉన్న‌తాధికారులు స్పందించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *