Anemia Ayurvedic Treatment:సహజమైన మెరుపుకాకుండా మీ ముఖచర్మం తెల్లగా, పాలిపోయి కాస్త మెరుపుతో ఉంటే మీలో రక్తం బలహీనమవుతోందని గుర్తు. ఎనీమియా అంటే రక్తం శరరీంలో తగ్గ టమే కాదు, ఉన్న రక్తంలో సామర్థ్యం అంటే, ముఖ్యంగా ఎర్రరకణాలు (RBC) తగ్గడమో లేదా వాటిలో ఉండవలసిన ముఖ్యధాతువు హిమోగ్లోబిన్ తగ్గడమో కావచ్చు.
ఎనీమియా కొందరి సమస్య కాదు. ప్రపంచ సమస్య, ప్రపంచం ముందున్న ఏకైక ధ్యేయం మానవాళిలో ఎనీమియా లేకుండా చేయగలగడం. ఎందుకంటే, ఈ భూగోళం మీద నివసించే ప్రజ లలో సగంపైన ఏదో రకంగా ఈ ఎనీమియా (Ayurveda For Anemia)తో బాధపడుతున్నారు.
Anemia Ayurvedic Treatment: కృంగదీసే ఎనీమియా
ఎనీమియా మనిషిని కృంగదీసే అత్యయిక వ్యాధుల్లో రెండవది. ఈ మధ్య జరిగిన ఒక పరిశోధనలో 239 మిలియన్ల పిల్లలు, అందులోనూ అయిదేళ్ళ లోపు పిల్లలు 468 మిలియన్ల స్త్రీలు, అందులో సగం సంఖ్యతో గర్భిణీ స్త్రీలు ఈ ఎనీమియా తో ఉన్నారని సూచించబడింది. అదీ అభివృద్ధి చెందిన దేశాలలో!.
పారిశ్రామికంగా ఎదిగిన దేశాలలో 40 శాతం మంది ఎనీమియా (Anemia) తో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ సంక్షేమ సంస్థ వారి సర్వేలో 53.3 శాతం మంది సంతానం పొందే వయస్సులో ఉన్నవాళ్ళు ఒక్క ఎనీమియా వల్ల మాతృత్వం పొందటంలో విఫలమవుతున్నారు. W.H.O వారు మన రక్తకణాలలో హిమోగ్లోబిన్ (Hemoglobin) 11 gri inDicilitre కన్నా తక్కువ ఉంటే, దాన్ని ఎనీమియాగా నిర్వహించారు.
మన రక్తంలో మూడు రకాల కణాలు ఎర్రకణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. అవి ప్లాస్మా అనే ద్రవంలో కలిసి శరీరమంతా ప్రసరిస్తూ ప్రయాణిస్తూ ఉంటాయి. రక్తం తనలోని కణా లలో పెద్ద, చిన్న, మరీ చిన్నగొట్టాలలో నిరంతరం సుదీర్గ ప్రయాణం చేస్తూ మనలోని ధాతువులు, వాటిలోని జీవకణాలు (సెల్స్) అనుసంధానం చేసుకుంటాయి.
వాటిలో ఎర్రరక్తకణాలని ఎర్రిత్రోసైటిస్ (Erythrocytosis) అని పిలుస్తారు. ఇవి చిన్న బుడిపెలులా ఉండి, చిన్నగొట్టాల్లోకి వెళ్ళినప్పుడు రూపాన్ని మార్చుకునే స్వభావంలో సుమారు ఒక క్యూబిక్ మిల్లీమీటర్కి 52,00,000 మగవాళ్ళలోను, 47,00,000 స్త్రీలలోనూ ఉంటాయి. ఈ ఎర్రరక్తణాలు మన జీవనానికి అత్యవసరమైన ప్రాణవాయువుని శ్వాస అవయవాల్లో నుండి గ్రహించి జీవకణాలకి అందిస్తాయి. ఈ శక్తి ఆర్.బి.సి.లో హిమోగ్లోబిన్కి మాత్రమే ఉంది.
అందుకే ఇది దెబ్బతింటే ప్రాణశక్తి తగ్గుతుంది. మన శరీరంలోని పెద్ద ఎముకల భాగంలో తయారై రక్తప్రసరణలో విడుదలయ్యాక సుమారు 120 రోజులు ప్రయాణించి, క్రమంగా శైథిల్యం చెందుతూ చివరకి స్ల్సీన్లో నిష్క్రమిస్తాయి. అలా శిథిలమైన రక్తకణాల ప్రభావం మన శరీరం మీద ఉండదు. ఎందుకంటే, నిరంతరం వాటి స్థానాన్ని నింపేటట్టు కొత్తకణాలు తయారుచేసే ప్రక్రియని పెట్టి వుంచాడు మన శరీరంలో ఆ భగవంతుడు.
నీరసం, నిర్లిప్తత
అలా శిథిలమైన వాటి నుండి వెలువడిన ధాతువులు ఇనుమువంటి అదే రక్తం ద్వారా లివరు ఎముకలలో భాగానికి చేరి మళ్ళీ కొత్త రక్తకణాల ఉత్పత్తికి కారణం అవుతుంది. మనం తినే ఆహారంలో రక్తవర్ధక పదార్థాలసారం పక్వస్థితికి చేరి ఈ రక్తకణాలు రక్తం తిరిగి తయారవ్వటానికీ దోహదం చేస్తాయి. స్థూలంగా చెప్పాలంటే, ప్రాణవాయువుని తీసుకెళ్ళే శక్తి రక్తం కోల్పోవడమే ఎనీమియా. ఆ శక్తి హిమోగ్లోబిన్కు ఉంది. అది ఎర్రరక్తకణాలలో ఉంది.
అందువల్ల రక్తమైనా ప్రమాదంవల్లో, గాయంవల్లో, మందుల వల్లో, మరేదైనా అంతర్గత కారణాల వల్లో, రక్తస్రావం జరగడం వల్ల తగ్గవచ్చు లేదా రక్తకణాల సంఖ్య తగ్గిపోవచ్చు లేదా ఉన్న రక్త కణాలలో హిమోగ్లోబిన్ పూర్తిగా తగ్గిపోవచ్చు లేదా పెద్ద ఎముఖలలో రక్తకణాల తయారీ కుంటు పడవచ్చు లేదా లివరు స్వీన్ వ్యాధుల వల్ల రక్తం తగ్గిపోవచ్చు. వాటన్నింటికీ పర్యవసానం ఎనీమియా! మనిషిలో నీరసానికి, నిర్లిప్తతకి సంకేతం ఇది.
Anemia Ayurvedic Treatment: రక్తవృద్ధికి
ప్రతి మనిషిలోనూ మలంద్వారా రోజూ అంటే, రక్తకణాలకి అవసరమైన ఇనుపధాతువు 0.6 మిల్లీగ్రాములు వెళ్లిపోతూ ఉంటుంది. ఆడవారిలో ఋతురక్తం ద్వారా మరికొంత పోతూ ఉంటుంది. అందువల్ల మనం ఇనుము ఉన్న ఆకుకూరలు, పాలు ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఈ రక్తక్షీణత పలు రకాలుగా ఉన్నా చిరకాలం నుంచి ఎనీమియా ఉన్నవాళ్ళు రక్తపరీక్షతో పాటు కిడ్నీలు, లివరు, స్ప్లీన్ వ్యాధులు ఉన్నాయేమోనని సరిచూసుకోవాలి.
దీర్థకాలంగా ఉన్న అజీర్ణం, జిగటవిరేచనాలు, దేనికైనా బలమైన మందులు వాడటం వల్ల కూడా ఎనీమియా రావచ్చు. జాగ్రత్తగా గమనించాలి. కాళ్ళు లాగడం, ఆకలి తగ్గడం, చర్మం, ముఖం పాలి పోవడం, విపరీతమైన నీరసం, ఆయాసం, బి.పి. తగ్గడం, గుండెదడ, విరేచనం రంగుమారటం వంటివి ముఖ్య లక్షణాలు.
ఈ వ్యాధులు రాకుండా చూసుకుంటూ, చెప్పకుండా జరిగే ప్రమాదాల (Accidents) బారిన పడకుండా మనం నిత్యం తీసుకునే ఆహారంలో గోంగూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, క్యారెట్, బీట్రూట్, పాలు, పప్పుదినుసులు మనం ఆహరంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఆహారం హితంగా, మితంగా సమయం దాటకుండా తీసుకుంటే అది జీర్ణమై, పక్వమై శరీరానికి ఒంటబడుతుంది. వేప చెక్కను ఎండబెట్టి పొడిచేసి పావుతులంచొప్పున ఆవునెయ్యితో కలిపి తింటే రక్తం వృద్ధిచెందుతుంది.
ఆవుపాలలో పటికబెల్లం పొడి, యాలకుల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే రక్త వృద్ధే కాదు, చక్కని నిద్రకూడా పడుతుంది. ఎనీమియా ఉన్నవాళ్ళు ఎక్కువ కారం, మసాలా వస్తువులు, చల్లటి పదార్థాలు, నిల్వ ఉన్న పదార్థాలు తినకూడదు. పాండువ్యాధి, పలు వ్యాధులకి కారణం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.