android mobiles నెల్లూరు: అత్యంత విలువైన సెల్ఫోన్లను చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా గూడురు రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.23,63,700 విలువ చేసే 228 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఎస్పీ విజయరావు గూడూరు లోని వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు. గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని గూడూరు రూరల్ సర్కిల్ పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా గూడూరు బైపాస్ ప్రాంతంలో అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. వారిని విచారించగా వీరు సెల్ఫోన్ల దొంగతనాలు చేసే అంతరాష్ట్ర ముఠా సభ్యులుగా తెలిసిందని (android mobiles)అన్నారు.


వీరి వద్ద రూ.23,63,700 ల విలువ చేసే 230 ఆండ్రాయిడ్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన మేకల కృష్ణ, మేకల పవన్‌ను అదుపులోకి తీసుకున్నామని వారితోపాటు ఇద్దరు మేకల రాము, మేకల హరి అనేవాళ్లును పట్టుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ నలుగురు దొంగలు ముఠాగా ఏర్పడి చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో కూలీలమని చెప్పి రూమును అద్దెకు తీసుకున్నారన్నారు. 45 రోజుల్లోనే చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో పగలంతా సెల్‌ఫోన్ దొంగతనాలు చేసుకుంటూ ఉండేవారని ఈ క్రమంలో చెన్నై నుండి గూడురుకు బస్‌లో వచ్చి గూడూరు నుంచి లారీలో విజయవాడ వెళ్లే క్రమంలో గూడూరు బైపాస్‌లో ఉండగా గూడూరు డిఎస్పీ ఎం.రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు రూరల్ ఎస్సై.వి.బ్రహ్మనాయుడు, చిల్లకూరు ఎస్సై అజయ్‌కుమార్ తమ సిబ్బందితో కలిసి ఎంతో చాకచక్యంగా దొంగల ముఠాను పట్టుకున్నారని పేర్కొన్నారు.


ఈ ముఠా నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని తమిళనాడు పోలీసులకు సమాచారం అందించామన్నారు. సెల్ఫోన్లను ఐఎంఇఐ నెంబర్ ఆధారంగా సదరు వ్యక్తులకు అందేలా చూస్తామని నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి కస్టడీకి తీసుకుంటామని మిగిలిన ఇద్దరు దొంగల్ని కూడా ఎక్కడున్నా పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన రూరల్ సర్కిల్ ఎస్సైలు బ్రహ్మనాయుడు, అజయ్‌కుమార్‌కు క్యాష్ రివార్డు అందజేస్తామని సిఐ శ్రీనివాసులు రెడ్డి కి గుడ్ సర్వీస్ ఎంట్రీ ఇస్తామని తెలిపారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?