guidelines for Bakrid Festival: కోవిడ్ నియంత్రన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగిస్తున్న నేపథ్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
guidelines for Bakrid Festival: అమరావతి : ఈ నెల 20,21 తేదీల్లో బక్రీద్ ప్రార్థనలు నిషేధిస్తున్నట్టు మైనార్టీ సంక్షేమ శాఖ ప్రకటించింది. మాస్కులు లేకుండా మసీదుల్లోకి ఎవరినీ అనుమతించొద్దని కమిటీలకు ఆదేశాలు జారీ చేసింది. భారీ జన సమూహాలను నివారించేందుకు, మసీదుల్లో మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. అందరూ భౌతిక దూరం పాటిస్తూ మసీదుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రార్థనలకు అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది. మసీదు ప్రాంగణాల్లో శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాల్సిందిగా కమిటీలకు సూచనలు చేసింది. వృద్ధులు, పిల్లలు ఇంటి వద్దే ప్రార్థనలు చేసుకోవాలని సూచింది. ఈద్ మిలాప్, ముసాఫా, ఆప్తులను కౌగిలించుకోవడం లాంటి కార్యక్రమాలను చేయొద్దని ముస్లిం సోదరులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


మాంసం విక్రయ కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాలను నదులు, వాగులు, చెరువుల్లో కలపకుండా చూడాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!