Andhra Pradesh SPO | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు శాఖ నిర్వహించే పనుల్లో తమ వంతుగా విధులు నిర్వర్తిస్తూ కీలకంగా మారిన ఎస్పీఓ(Special Police Officer)ల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఏపీ బోర్డల్లో రాత్రి-పగలు అని తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో వారు ఏపీ ప్రభుత్వానికి ఎంతగానో కృషి చేశారు. ఎస్పీఓల వల్ల ప్రభుత్వానికి, ఇటు పోలీసు శాఖకు కాస్త ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. కొంత కాలం వరకు ఎస్పీల జీవన విధానం భాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు వారు రోడ్డెక్కే పరిస్థితి(Andhra Pradesh SPO) వచ్చింది.
జగ్గయ్యపేటలో ఎస్పిఓలు ముందస్తు అరెస్టులు!
11 నెలల నుండి జీతాలు రావడం లేదని, తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ అటు ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారికి మాత్రం ఎలాంటి ప్రయో జనం కనిపించలేదు. ఇక చేసేది ఏమీ లేక డైరెక్టుగా అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకుందామనుకున్నారు. రోజురోజుకూ తమ పరిస్థితి ఇబ్బంది కరంగా మారిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎంను కలవాలనుకున్నారు.
జగ్గయ్యపేట(JAGGAYYAPETA) సర్కిల్ పరిధిలోని ఎస్పివో(SPO JOBS in AP) లు తమ జీతాలు చెల్లించాలని శాంతియుతంగా నిరసన తెలియ జేయడానికి అసెంబ్లీ వద్దకు వెళుతున్నారని సమాచారం రావడంతో సిఐ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ముందస్తు అరెస్టు చేసి సర్కిల్ కార్యాలయానికి గురువారం తరలించారు. ఈ సందర్భంగా ఎస్పివో లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మద్యం, అక్రమ గ్రావెల్, గుట్కా, గంజాయి వంటి మాదకద్రవ్యాలు, ఇసుక తరలింపు లను నిరోధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 2156 మందిని జగ్గయ్య పేట సర్కిల్ పరిధిలో 84 మందిని విధుల్లోకి తీసుకున్నారని అన్నారు.
మాపై దయ చూపండి!
గతంలో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలు చెల్లించిదని, ఇసు కను ప్రైవేటు వారికి అప్పగించిన తర్వాత 11 నెలలుగా తమ జీతాలు లేక కుటుంబాలు రోడ్డున పడ్డా యని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో తమ జీతాలు చెల్లించాలని అందరూ అధికారులు, ప్రజా ప్రతి నిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదని అన్నారు. ఈ రోజు అసెంబ్లీకి వెళ్లి రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి రహదారి వెంట ప్లేకార్డ్ ప్రదర్శించి తమ జీతాలు చెల్లించాలని వేడుకోవడానికి వెళ్తున్న తమను అరెస్టు చేసి సర్కిల్ కార్యాలయానికి తరలించారని పేర్కొన్నారు.
తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు!
తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, SPOల కుటుంబాన్ని కూడా తమ వైయస్సార్సీపి కుటుంబ సభ్యులు గా గుర్తించి 11 నెలల జీతాన్ని చెల్లించాలని, ఎస్ పి వో గా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుం టున్నారు. ఇదిలా ఉండగా ఎస్పిఓలు ఇప్పుడు బోర్డర్లో కనిపించని పరిస్థితి నెలకొంది. ఉద్యోగ భద్రత కరువ్వ డంతో కొందరు ఉద్యోగాలను వదిలి వేరే పనులు చూసుకుంటున్నారు. మరికొందరు ప్రభుత్వం కరుణిస్తదేమోనని ఆశగా ఎదురు చూస్తూ తమ జీతాల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ఎస్పిఓలలో ఎక్కువ మంది ఉద్యోగాన్ని వదులు కోవడానికి ఇష్ట పడటం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం జీతాల ఆలస్యం కారణంగా ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు కొందరు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!