Sleepless Nights

Sleepless Nights : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిద్ర‌లేని రాత్రి | Zptc Mptc elections 2021

పొలిటిక‌ల్ స్టోరీలు

Sleepless Nights : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిద్ర‌లేని రాత్రి | Zptc Mptc elections 2021

Sleepless Nights : శివ‌రాత్రి జాగారం కంటే ఎక్కువ‌గా, ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కంటే ఉత్కంఠంగా మంగ‌ళ‌వారం రాత్రి రాష్ట్రమంతా నిద్ర లేకుండా(పోకుండా) అతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎల‌క్ష‌న్‌కు అంతా సిద్ధ‌మై ప్ర‌చారం ముగింపుకు కొద్ది గంట‌ల ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు సింగిల్ జ‌డ్జి ఇటీవ‌ల రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఇచ్చిన నోటిఫికేష‌న్‌పై స్టే ఇవ్వ‌డం, ఆగ‌మేఘాల మీద ప్ర‌భుత్వం, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ బెంచ్ అప్పీల్ కు వెళ్ల‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి.

ఇదంతా ఒక ఎత్తైతే తీర్పు అర్థరాత్రి 2.30 గంట‌ల‌కు వ‌స్తున్న‌ద‌ని వార్త రావ‌డంతో ఏమి జ‌రుగుతుందో ఏమో అని రాష్ట్ర ప్ర‌జ‌లు, అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు, అధికారులు, ఉద్యోగులు, కార్య‌క‌ర్త‌లు నిద్ర‌లేకుండా టీవీ/ మొబైల్ లు చూస్తూ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఒక వైపు అభ్య‌ర్థులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికార పార్టీ, మ‌రోవైపు ఎన్నిక‌ల విధుల‌కు హాజ‌ర‌య్యే ఉద్యోగులు సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచించ‌డం అంద‌ర్నీ అయోమ‌యానికి గురిచేసింది.

ఇప్ప‌టికే ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల్లో వ్యాపార సంస్థ‌లు, పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, వివిధ ప్ర‌భుత్వ / ప్రైవేటు కార్యాల‌యాల‌కు ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సెల‌వులు ఇవ్వాలా, వ‌ద్దా? అనుకూలంగా వ‌స్తే స‌రే లేక‌పోతే ఏమి చేయాలో పాలుపోక అధికారులు అధికారులు త‌ల‌ల‌పట్టుకున్నారు. మ‌రోవైపు ఏమి జ‌రుగుతుందో అని బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల‌కు టెన్ష‌న్ కు గుర‌వుతున్నారు. తీర్పు వ‌చ్చాక వార్త వ్రాయ‌డానికి సిద్దంగా విలేక‌ర్లు, మీడియా ప‌డిగాపులు కాస్తుంది.

డ్యూటీకి వెళ్లాలా వ‌ద్దా? అని ఉద్యోగులు తీర్పు కోసం టీవీల ముందు కూర్చొని, నిద్ర రాకుండా టీ, కాఫీ పెట్ట‌డానికి భార్య‌ను మేల్కొని ఉండ‌మ‌ని చెప్ప‌డం రేపు పాఠ‌శాల / క‌ళాశాలల‌కు పోవాలా వ‌ద్దా? అని తీర్పు కోసం విద్యార్థులు కూడా రాత్రి జాగారం చేస్తున్న విచిత్ర ప‌రిస్థితి నేడు నెల‌కొంది. ప్ర‌తిప‌క్షాలు ఏమో కానీ అధికార‌ పార్టీ కార్య‌క‌ర్త‌లు మాత్రం కంటిలో ఒత్తులు వేసుకుని ఏమో కానీ అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు మాత్రం కంటిలో ఒత్తులు వేసుకుని నాయ‌కుల ఇంటి ద‌గ్గ‌ర ప‌డిగాపులు కాస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో తొలిసారి ఇలాంటి విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంద‌ని ప‌లువురు చెబుతున్నారు. మొత్తంగా తీర్పు అర్థ‌రాత్రి రాలేదు.. ఆపైన నిద్ర‌కూడా పోలేదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు.

– రంగ‌, సూర్య గుంటూరు బ్యూరో

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *