Rain: ఏపీకి Good News : మూడు రోజుల పాటు వర్షాలు
Rain: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఛత్తీస్ గఢ్, తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది.
దీని ప్రభావంతో ఉత్త కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ నెల 20న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో మంగళవారం దక్షిణ కోస్తాంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీలో రాబోయే 3 రోజుల వరకు వాతావరణ వివరాలు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
బుధవారం ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయల సీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల సెంటీగ్రేట్ అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court