AP Curfew : ఏపీలో బుధవారం నుంచి పగలు కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజలకు వెసులుబాటునిచ్చింది.
AP Curfew : అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరికే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణా పైనా ఆంక్షలు విధించనున్నట్టు తెలుస్తోంది. ప్రజా రవాణా ముఖ్యంగా ఆటోలు, ఆర్టీసీ బస్సులు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే రవాణాకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. వీటితో పాటు సిటీ బస్సుల రాకపోలను కూడా నియంత్రించేందుకు వీలుగా అధికారులకు ఆదేశాలు అందాయి. కర్ఫ్యూ సమయం మించి రాకపోకల్పి నియంత్రించడం ద్వారా కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చనే నిర్ణయం ప్రభుత్వం భావిస్తోంది.
ఇక 12 గంటల తర్వాత అత్యవసర సేవలు నిర్వహించే వాహనాలు మాత్రమే రోడ్లపైకి అనుమతించనున్నారు. ఉదయం షాపులు తెరిచే సమయంలోనే ప్రజారవాణాకు అనుమతించాలని ఆ సమయంలోనూ 144 సెక్షన్ అమలు చేయబోతోన్నట్టు అధికారులు తెలిపారు. గుంపులు గుంపులుగా షాపింగ్లు చేయడం, ప్రయాణాలు చేయడంపై నిషేధం ఉంటుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ఆంక్షలు ఏపీలో రెండు వారాల పాటు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court