Andhra Bank : ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారులకు బ్యాంకు కొన్ని సూచనలు చేసింది. వాటిని అమలు చేయనున్నట్టు పేర్కొంది.
Andhra Bank : ఇటీవల ఆంధ్ర బ్యాంకు ను యూనియన్ బ్యాంక్‌లోకి విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులు కొన్ని సూచనలు చేసింది ఆ బ్యాంక్. అకౌంట నెంబర్ పాతదే ఉంటుందని, కస్టమర్ ఐడి కూడా పాతదే ఉంటుందని పేర్కొంది. కొత్త పాస్ బుక్ మాత్రం ఇక నుంచి యూనియన్ బ్యాంకు ముద్రతో వస్తుందని స్పష్టం చేసింది. ఆంధ్ర బ్యాంక్(Andhra Bank) చెక్ బుక్ లు 31.3.2021 తేదీ వరకు మాత్రమే పనిచేస్తాయని తర్వాత పనిచేయవని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంకు చెక్ బుక్కులు కొత్తవి తీసుకోవాలని పేర్కొంది. ఆంధ్ర బ్యాంక్ IFSC కోడ్ మార్చి నెలాఖరు వరకు మాత్రమే పనిచేస్తుందని, ఏప్రిల్ నుండి యూనియన్ బ్యాంక్ IFSC కొత్త కోడ్ మీ దగ్గరిలో ఉన్న యూనియన్ బ్యాంక్ లేదా (ఆంధ్రాబ్యాంక్) వద్ద తెలుసుకోవాలని కోరింది. ఒక వేళ మొబైల్ బ్యాంకింగ్ వాడే వారు U – mobile app అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలని, పాత (app ab tej) పని చేయదని తెలిపింది. ఇకపై ఏమైనా సందేహాలు ఉంటే యూనియన్ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ 1800 208 2244 కు ఫోన్ చేసి తెలుసుకోవాలని బ్యాంక్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి