Cheating Case

Cheating Caseలో యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త అరెస్టు

Spread the love

Cheating Case : తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటు గుర్తింపు తెచ్చుకున్నయాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త న‌ర్సింహారెడ్డి చీటింగ్ కేసులో అరెస్టు అయ్యారు. ఇటీవ‌ల‌ రాజ‌కీయాల్లో యాంక‌ర్ శ్యామ‌ల దంపతులు చురుగ్గా ఉంటున్నారు.


Cheating Case : ప్ర‌ముఖ తెలుగు బుల్లితెర యాంక‌ర్ శ్యామ‌ల(Anchor Shyamala) భ‌ర్త న‌ర్సింహారెడ్డిని పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్టు చేశారు. ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న హైద‌రాబాద్ రాయ‌దుర్గం పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో న‌ర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు (Cheating Case) న‌మోద‌య్యింది. త‌న వ‌ద్ద నుంచి కోటి రూపాయ‌లు తీసుకుని, తిరిగి ఇవ్వ‌కుండా మోసం చేస్తున్నాడ‌ని అత‌నిపై ఓ మ‌హిళ ఫిర్యాదు చేసింది.

2017 సంవ‌త్స‌రంలో త‌న వ‌ద్ద కోటి రూపాయ‌లు తీసుకున్నాడ‌ని, డ‌బ్బులు అడిగితే న‌ర్సింహారెడ్డి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, లైంగిక వేధింపుల‌కు కూడా గురిచేశాడ‌ని త‌న ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ వ్య‌వ‌హారంలో సెటిల్మెంట్ చేసుకోవాల‌ని మ‌రో మ‌హిళ కూడా రాయ‌బారం న‌డిపింద‌ని బాధితురాలు తెలిపిది. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు న‌ర్సింహారెడ్డిని రాయ‌దుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఇక యాంక‌ర్ శ్యామ‌ల దంప‌తులు బుల్లితెర‌తో పాటు ఈ మ‌ధ్య‌న రాజ‌కీయాల్లోనూ యాక్టివ్‌గానే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వీళ్లిద్ద‌రూ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చార‌మూ చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌ల‌తో శ్యామ‌ల దంప‌తుల‌కు మంచి సంబంధాలున్న‌ట‌యాఇ. ఇటీవ‌ల తెలంగాణ‌లో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ ష‌ర్మిళ‌ను కూడా క‌లిసి వీరు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ క్ర‌మంలో శ్యామ‌ల భ‌ర్త అరెస్టు కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Bank loan fraud : లోన్ల పేరుతో కొత్త త‌ర‌హా మోసం వెలుగులోకి !

ఆస్తిప‌త్రాలు తీసుకుని తిరిగివ్వ‌కుండా వేధిస్తున్న వైనంల‌క్ష‌లు దండుకున్న కేటుగాళ్లుకృష్ణ‌లంక పోలీసుస్టేష‌న్‌లో కేసు న‌మోదు Bank loan fraud :Vijayawada: విజ‌య‌వాడ న‌గ‌రంలోని ఓ కొత్త త‌ర‌హా మోసం Read more

municipal commissioner:నూతన కమిషనర్ కు అభినందనలు-ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర సమితి

municipal commissioner ఫీర్జాదిగూడ: 'ఇంకెంత కాలం కాలయాపన చేస్తారు.. కార్మికులకు జీతాలు పెంచకుండా..' మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు పెంచి చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ Read more

TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు

TRS Plenary Meeting: హైద‌రాబాద్ : 'ఇవాళ కొంత మంది ఎగిరెగిరి ప‌డుతున‌నారు.. టి- కాంగ్రెస్‌, టి- బిజెపి..కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే Read more

Sama Venkat Reddy: టిఆర్ఎస్‌కు ఝ‌ల‌క్‌..కాంగ్రెస్‌లోకి సామ వెంక‌ట‌రెడ్డి?

Sama Venkat Reddy: ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర క‌నీస వేత‌నాల స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ సామ వెంక‌ట‌రెడ్డి, స‌హా మండ‌లి కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులంద‌రూ టిఆర్ఎస్‌కు ఝ‌ల‌క్ Read more

Leave a Comment

Your email address will not be published.