Ananya Panday Dating | లైగర్ హీరోయిన్ అనన్య పాండే గురించి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎక్కువుగా వైరల్ అవుతున్న వార్త అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ డేటింగ్ చేస్తున్నారని. ఇటీవల కాలంలో ఈ ఇద్దరూ కలిసి తరుచూ చెట్టాపట్టాలేసుకొని బయటకు వెళుతున్నారు. ఈ నూతన సంవత్సరం 2022 వేడుకలను కూడా ఇద్దరు కలిసి చేసుకోవడం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు బలాన్ని చేకూర్చింది. కానీ ఇంత వరకూ ఈ జంట తమ డేటింగ్‌పై వస్తున్న రూమర్లకు, కథనాలకు(Ananya Panday Dating) స్పందించలేదు.
తాజాగా లైగర్ బ్యూటీ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఒక వార్త వచ్చింది. ఇటీవల బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పాండే తాను ఒంటరిగా లేను అని చెప్పింది. ఇంటర్వ్యూలో లైగర్ బ్యూటీ అభిమానులతో ముచ్చటించింది. ఇంటర్వ్యూలో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చింది. కానీ ఓ నెటిజన్ అనన్యను రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడగగానే.. చివరకు నేను హ్యాపీగానే ఉన్నాను. అంటూ సమాధానం చెప్పింది.
మరొక అభిమాని అనన్యను మీకు ఇష్టమైన సహనటుడు ఎవరు అని ప్రశ్నించగా అనన్య మాత్రం ఆలోచించకుండా ఇషాన్ ఖట్టర్ పేరును టక్కున చెప్పేసింది. ఆ తర్వాత తన సహనటులందరూ బాగా నటించారని, సిద్ధాంత్ చతుర్వేది తనతో కలిసి ఖో గయే హమ్ కహాన్‌లో మళ్లీ పని చేస్తానని చెప్పింది. మొత్తంగా హీరో ఇషాన్ ఖట్టర్‌తో ఉన్న రిలేషన్ షిప్ స్టేటస్ గురించి బహిరంగంగానే చెప్పేసింది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!