Anantapur latest news: తండ్రి ప్రేమ క‌ల్మ‌ష‌మైన వేళ.. కూతురు త‌న పోలిక‌ల‌తో లేద‌ని…!

Spread the love

Anantapur latest news అనంత‌పురం: మాన‌మ‌త్వం మంట‌గ‌లుస్తోంది. ప్రేమ అనే ప‌దం ఇప్పుడు మ‌స‌క‌బారుతోంది. కొంద‌రి త‌ల్లిదండ్రుల ప్రేమ రోజురోజుకూ వికృత చేష్ట‌ల‌కు దారితీస్తోంది. త‌న ర‌క్తాన్ని పంచుకుపుట్టిన క‌న్న కూతురు త‌న పోలిక‌ల‌తో లేద‌ని దారుణంగా హ‌త్య చేశాడు ఓ క‌సాయి తండ్రి. ఏ పాపం ఎరుగ‌ని ఓ చిన్నారి ఆ తండ్రికి కూతురు అయినందుకు ఇప్పుడు మృత్యు వ‌డిలోకి చేరిన దుర‌దృష్ట సంఘ‌ట‌న ఇది. అనంత‌పురం జిల్లా క‌ల్యాణ‌దుర్గంలో దారుణం చోటు (Anantapur latest news)చేసుకుంది.

రెండు నెల‌ల ప‌సికందును చెరువులో ప‌డేశాడు ఓ క‌సాయి తండ్రి. చిన్నారి త‌న పోలిక‌ల‌తో లేద‌ని ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. అనంత‌రం భార్య‌తో భ‌ర్త మ‌ల్లికార్జున్ ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు. గురువారం సాయంత్రం బిడ్డ‌ను ఎత్తుకెళ్లి భ‌ర్త మ‌ల్లికార్జున్ చిన్నారిని హ‌త్య చేశాడు. స్థానికులు,కుటుంబ స‌భ్యుల వివ‌రాల ప్ర‌కారం..న‌ర్సాపురం గ్రామానికి చెందిన చిట్టెమ్మ‌కు ఐదుక‌ల్లు గ్రామానికి చెందిన మ‌ల్లికార్జున్‌తో ఏడాది కింద‌ట వివాహం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య రెండు నెల‌ల పాప పుట్టింది.

అయితే చిన్నారి త‌న పోలిక‌ల‌తో లేదంటూ ఆగ్ర‌హంతో ప‌సికందును భ‌ర్త మ‌ల్లికార్జున్ చెరువులో ప‌డేశాడు. త‌ల్లి(చిట్టెమ్మ‌) పై అనుమానంతోనే చిన్నారిని క‌డ‌తేర్చారంటూ కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ప‌సికందు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మ‌ల్లికార్జున్ ను అదుపులోకి తీసుకొని కేసు న‌మోదు చేశారు.

Swimming Pond : కొత్త సైకిళ్ల‌తో వెళ్లి విగ‌త‌జీవులుగా మారి!

Swimming Pond : కొత్త సైకిళ్ల‌తో వెళ్లి విగ‌త‌జీవులుగా మారి! Swimming Pond : ఈత‌కెళ్లి ఇద్ద‌రు చిన్నారులు గ‌ల్లంతైన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ Read more

Ananthapuram news today: జిల్లాలో టిడిపి మ‌హిళా నాయ‌కురాలు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Ananthapuram news today అనంత‌పురం: జిల్లా టిడిపి మ‌హిళా జిల్లా కార్య‌ద‌ర్శి వాల్మీకి ప్రియాంక పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. నా భార్య ను పోలీసుల Read more

teacher murderd: క‌దిరిలో బ‌రితెగించిన దొంగ‌లు..ఉపాధ్యాయురాలు హ‌త్య‌

teacher murderd: అనంత‌పురం: క‌దిరిలో దొంగ‌ల బీభ‌త్సం అక్క‌డ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించి ఓ ఉపాధ్యాయురాల‌ని చంపారు దుండ‌గులు. క‌దిరి ప‌ట్ట‌ణంలోని మంగ‌ళ‌వారం Read more

municipal co-option member: వైసీపీ మున్సిప‌ల్ కో ఆప్ష‌న్ మెంబ‌ర్ ఆత్మ‌హ‌త్య‌

municipal co-option member అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి మున్సిప‌ల్ వైసీపీ కో ఆప్ష‌న్ మెంబ‌ర్ ఆదం అహ్మ‌ద్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తాను చ‌నిపోతున్నాన‌ని చివ‌రిసారిగా ఓ వీడియోను Read more

Leave a Comment

Your email address will not be published.