Amul Milk: గుజరాత్: అమూల్ సంస్థ భారీ సంఖ్యలో ముస్లిం ఉద్యోగులను తొలగించినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో ప్రచారం చేసేది ఏమిటంటే?
” అమూల్ మిల్క్ అధిపతి ఆనంద్ సేథ్ తమ కంపెనీ నుంచి లక్షా 38 వేల మంది ముస్లిం ఉద్యోగులను తొలగించారు. ఆవు మనకు పాలిస్తుంది. దానితోనే మా వ్యాపారం నడుస్తుంది. కానీ మరో వర్గం ప్రజలు ఆవును కోసుకుని తింటారు. అది మాకు సిగ్గు చేటు. అలాంటి హంతకులను మా సంస్థలో ఉంచలేం అని అమూల్ మిల్క్ సీఈఓ ఆనంద్ సేథ్ అన్నారు. ” అంటూ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది.
Amul Milk: అసలు ఈ ప్రచారంలో నిజమెంత?
అమూల్ సహకార సంస్థను 1950 డాక్టర్.వర్గీస్ కురియన్ (Dr. Verghese Kurien) స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ టర్నోవర్ 52,000 వేల కోట్ల రూపాయలు. గుజరాత్లో ఆనంద్‌లో ఉన్న అమూల్ సంస్థ నుండి పాల ఉత్పత్తులు దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళుతుంటాయి. అయితే ఈ సంస్థ 1లక్షా 38 వేల ముస్లిం ఉద్యోగులను తొలగించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అమూల్ సంస్థ ఈ వైరల్ అవుతున్న ప్రచారాన్ని తన అధికారిక వెబ్సైట్లో కానీ, సోషల్ అకౌంట్లలో పెట్టారేమోనని పరిశీలించగా, ఎక్కడా ఈ ప్రచారానికి సంబంధింని విషయాలు కనిపించ లేదు.
అయితే అమూల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్.శోధి(RS Sodhi) ఈ విషయంపై స్పందించారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తమకు అర్థం కాదు అని పేర్కొన్నారు. తమ అమూల్ సంస్థ గత రెండేళ్లల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. తమ వ్యాపారం అభివృద్ధి పథంలో సాగుతుందని అన్నారు. ఒక వేళ ఎవరినైనా ఉద్యోగం లో నుంచి తీసివేయాలన్నా దానికి మతం ప్రాతిపదికం కాదని తేల్చేశారు.
దేశవ్యాప్తంగా అమూల్ సంస్థలో దాదాపు 16 వేల నుంచి 17 వేల మంది ఉద్యోగులు ఉన్నారని అన్నారు. వారందర్నీ ప్రతిభ, నైపుణ్యత ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేశారే తప్ప, సామాజిక, మత ప్రాతిపదిక లపై కాదని తెలిపారు. వైరల్ అవుతున్న పోస్టులో అమూల్ మిల్క్ అధిపతి ఆనంద్ సేథ్ అని చెబు తున్నారు. అసలు ఈ ఆనంద్ సేథ్ ఎవరు? అమూల్ మిల్క్ అధిపతి పేరు ఆనంద్ సేత్ కాదని అ న్నారు. ఈ పేరు మీద అమూల్ సంస్థలో ఎవ్వరూ లేరని పేర్కొన్నారు. అమూల్ తో దేశవ్యాప్తంగా 36 వేల మంది రైతులు కలిసి పని చేస్తున్నారని చెప్పారు. వారంతా వివిధ సామాజిక రంగాల నుంచి వివిధ మతాల నుంచి వచ్చారని తెలిపారు. ఆనంద్ సేథ్ అనే పేరు గల వారు అమూల్‌లో ఎవ్వరూ లేరని.ఈ ప్రచారం ఫేక్ అని RS Sodhi కొట్టిపారేశారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి