Amaravati Farmers : గుంటూరు : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ తగిలింది. శనివారం మందడం నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను మార్గమధ్యలో దళిత మహిళా రైతులు, రైతులు అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దళిత రైతు పులిచిన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎమ్మెల్యే వెళ్లాక వదిలిపెట్టారు. కాగా అసైన్డ్ కౌలు, పింఛను కోసం వినతి పత్రం ఇద్దామనుకుంటే అరెస్ట్లు చేస్తారా? తమ గోడు వినరా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దళిత రైతు పులిచిన్నను పోలీసులు అదుపులోకి తీసుకని వైస్సార్సీపీ పార్టీకి చెందిన కారు నెంబర్ లేని కారులో పోలీసులు స్టేషన్కు తరలించినట్టు ఆందోళన కారులు తెలిపారు.


- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?