AMARAVATHI CAPITAL

AMARAVATHI CAPITAL : బోర్డు తిప్పిన మ‌రో ప్రైవేటు బ్యాంకు?

Spread the love

రూ.50 ల‌క్ష‌ల‌కు వ‌ర‌కు టోక‌రా!
నూజివీడు కేంద్రంగా వెలిసిన సంస్థ‌
ల‌బోదిబో మంటున్న బాధితులు
?

AMARAVATHI CAPITAL : బోర్డు తిప్పిన మ‌రో ప్రైవేటు బ్యాంకు?

AMARAVATHI CAPITAL : Nuzividu : చిన్న‌చిన్న వ్యాపార‌స్థులు, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలే టార్గెట్‌గా ఎంచుకున్న ప్రైవేటు బ్యాంకు బోర్డు తిప్పేసిన సంఘ‌ట‌న కృష్ణా జిల్లా నూజివీడులో వెలుగు చూసింది. ఈ ప్రైవేటు బ్యాంకు సుమారు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు బాధితుల నుండి వ‌సూలు చేసిన‌ట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నూజివీడు ప‌ట్ట‌ణంలో ఒక బ్రాంచ్‌గా అమ‌రావ‌తి క్యాపిట‌ల్ మ్యూచివ‌ల్ మ‌ల్టీప‌ర్ప‌స్ సొసైటీ ప్రైవేటు లిమిటెడ్ (AMARAVATHI CAPITAL MUTUALLY AIDED MULTY PURPOSE CO-OPERATIVE SOCIETY LTD) తో ఒక ప్రైవేటు బ్యాంకు వెలిసింది. చిన్న చిన్న వ్యాపార‌స్థులు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం ల‌క్ష్యంగా వీళ్లు వ్యాపారం సాగించారు. ఈ ప్రైవేటు బ్యాంకు కొంత మంది ఏజెంట్ల‌ను స్థాపించి ఏజెంట్ల ద్వారా తెలిసిన వారి ద‌గ్గ‌ర నుండి వ్యాపార‌స్థులు, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల వ‌ద్ద నుండి రోజుకి వంద రూపాయ‌ల నుండి ఎంత‌వ‌ర‌కైనా క‌ట్టుకోవ‌చ్చ‌ని న‌మ్మ‌బ‌లికారు. రోజుకు సుమారు ఒక వ్య‌క్తి రూ.500 క‌డితే ఒక సంవ‌త్స‌రం పాటు క‌ట్టాల‌ని అత‌ని ట‌ర్మ్ అయిన త‌ర్వాత 21 రోజులు దాటిన త‌ర్వాత 8 శాతం వ‌డ్డీతో అస‌లు వ‌డ్డీ తిరిగి చెల్లిస్తామ‌ని ఏజెంట్ల ద్వారా న‌మ్మ‌బ‌లికారు. దీంతో జ‌నం సుమారు 150 మంది నుండి 200 మంది వ‌ర‌కు ఈ సంస్థ‌లో ప‌నిచేసిన‌ట్టు తెలుస్తోంది.

AMARAVATHI CAPITAL : రోజుకు రూ.500 చొప్పున ఏడాది పాటు..

ఎక్కువుగా బాధితులు రోజుకు రూ.500 చొప్పున ఒక సంవ‌త్స‌రం పాటు చెల్లించ‌డం జ‌రిగింది. 8 శాతం వ‌డ్డీతో క‌లుపుకుని సంవ‌త్స‌రం పాటు క‌డితే సుమారు ఒక ల‌క్షా 92 వేల రూపాయ‌లు వ‌స్తుంద‌ని ఆశ‌గా ఎదురు చూశారు. సంవ‌త్స‌రం గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు కానీ వ‌డ్డీ చెల్లించ‌క పోవ‌డంతో బాధితులు ఆందోళ‌న‌కు దిగారు. సుమారు నూజివీడులోని 150 నుండి 200 మంది క‌ట్టిన‌ట్టుగా తెలుస్తోంది. దీంతో మొత్తం 50 ల‌క్ష‌ల వ‌ర‌కూ డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక ఎస్ఐ గ‌ణేష్ కుమార్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

తిరువూరు ప‌ట్ట‌ణంలోనూ…!

ఇటు తిరువూరు ప‌ట్టణంలో కూడా అమ‌రావ‌తి క్యాపిట‌ల్ మ్యూచివ‌ల్ మ‌ల్టీప‌ర్ప‌స్ సొసైటీ ప్రైవేటు లిమిటెడ్ పై ఆందోళ‌న మొదలైంది. డిపాజిట్ సొమ్ముకు గ‌డువు తీరినా చెల్లించ‌క‌పోవ‌డంతో సొసైటీ యాజ‌మాన్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సుమారు రూ.5 ల‌క్ష‌ల‌కు పైగా అమాయ‌క ప్ర‌జ‌ల‌కు ప్రైవేటు బ్యాంకు కుచ్చుటోపీ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

మీడియాకు వివ‌రాలు తెలుపుతున్న ఎస్ఐ గ‌ణేష్ కుమార్‌
50 Sheep killed : రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు మృతి

50 Sheep killed :Nuzividu: రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు అక్క‌డికక్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న కృష్ణా జిల్లా నూజివీడు మండ‌లం మీర్జాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. Read more

Tiruvuru Revenue Division:తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్ స్వాగ‌తిస్తూ సంబురాలు!

Tiruvuru Revenue Division ఎ.కంభంపాడు: కృష్ణా జిల్లా నుండి విడిపోయిన ఎన్టీఆర్ జిల్లా (విజ‌య‌వాడ‌)లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్‌ను ప్ర‌భుత్వం నిర్థారించింది. దీనిని Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

pushpa lorry scene: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక మాఫియా ఆగ‌డాలు

pushpa lorry scene గ‌రిక‌పాడు: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక‌మాఫియా ఆగ‌డాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీల‌ను ఆంధ్రా - తెలంగాణ స‌రిహ‌ద్దు Read more

Leave a Comment

Your email address will not be published.