Song Name: Amma Nenu Vasthane
Credits: CPIM Telangana
Amma Nenu Vasthane Lyrics in Telugu
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
ర్యాలీలోన మీరు ఎర్రజెండా అంటే..
ర్యాలీలోన మీరు ఎర్రజెండా అంటే..
వర్ధిల్లాలి అంటూ నేను జై కొడతానమ్మా..
వర్ధిల్లాలి అంటూ నేను జై కొడతానమ్మా..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
మీటింగ్ దెగ్గర అది ఇది కొనమని
జిత్తు చేసి నిన్ను ఇబ్బంది పెట్టను..
లక్షల మందిలో తప్పిపోక నేను
నీ చెయి పట్టుకొని నీవెంటనే ఉంటాను..
డప్పుపైన పాట మోగగా..ఆ…ఆ
జనమంత గుంపుగూడగా..ఆ..ఆ
డప్పుపైన పాట మోగగా..ఆ…ఆ
జనమంత గుంపుగూడగా..ఆ..ఆ
కోయిలమ్మనై నేను కోరస్సే పాడతాను..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
ఇంగ్లీష్ హిందీలో నాయకుల మాటలను
తెలుగులోకి మార్చి మీకు తెలియజెప్పుతాను..
పాటల క్యాసెట్లు, ప్రజలా పుస్తకాలు
వచ్చేటప్పుడు మనం కొనుక్కొని వద్దాము..
రైలు,బస్సుల్లోనా ఇల్లే చేరే వరకూ
రైలు, బస్సుల్లోనా ఇల్లే చేరే వరకూ..
ఉద్యమాల చరితను గానమే చేద్దాము
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
ప్రజా నాయకులకు ఎదురుగా నే వెళ్లి
చేతిలో చెయ్యేసి షేకెండ్ ఇస్తాను..
హక్కుల కోసం పోరాడే వారంత
గెలిచి తీరాలంటూ సెల్యూట్ చేస్తాను..
బాల సంఘంలోనా సభ్యురాలుగా చేరి
బాల సంఘంలోనా సభ్యురాలుగా చేరి..
బావి పోరాటాల బాటనేనౌవుతాను
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
అమరుల ఫొటోలు ఇంటిలోన పెట్టి
పూలు జల్లి నేను జోహార్లు అంటాను..
వారు నడిచినట్టి త్యాగాల బాటను
నా తోటి పిల్లలకు కథలాగ చెబుతాను..
మళ్లొచ్చే ఏటికల్లా..ఆ..ఆ
జరిగేటి సభలకూ..
మళ్లొచ్చే ఏటికల్లా..ఆ..ఆ
జరిగేటి సభలకూ..
దండోర మోగిస్తూ దండునే కడతాను
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
ర్యాలీలోన మీరు ఎర్రజెండా అంటే..
ర్యాలీలోన మీరు ఎర్రజెండా అంటే..
వర్ధిల్లాలి అంటూ నేను జై కొడతానమ్మా..
వర్ధిల్లాలి అంటూ నేను జై కొడతానమ్మా..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..
అమ్మా నేను వస్తనే
ఎర్ర జెండానెత్తుకుంటనే..