Amma Geesina Bomma: ఒక సాధారణ వ్యక్తి జీవితంలో కష్టపడి ఉన్నత స్థాయికి వెళ్లినప్పుడు తాను పడిన కష్టాలను గుర్తు చేసుకోవడం నిజంగా ఉత్తమ లక్షణం. ప్రస్తుత కాలంలో ఉన్నత పదవులు ఏలే ప్రతి వారూ వారి వారి కష్టాలను మరిచి పోయి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. సొంత రక్త సంబంధీకులను, ఆఖరికి తల్లిదండ్రులను వెలివేసి వేరుగా చూస్తున్నారు. అలాంటి వారి కోసమే Bvm Creations నుండి వెలువడిన అద్భుతమైన గానం అమ్మ గీసిన బొమ్మను నేను.. నాన్న కలల రూపము నేను.
Bvm Siva Shankar ఆధ్వర్యంలో విడుదలైన ఈ పాట ఇప్పుడు అందరికీ ఇన్స్పరేషన్గా మారింది. ప్రతి ఒక్కరూ ఈ పాటను విని బివిఎం యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు. మనం ఎక్కడున్నా మన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని, వారి యోగ క్షేమాలను చూసుకోవాలనేది పాట అసలైన నేపథ్యం. పాట అంతా ఒక భావోద్వేగంతో మనసును నింపుతుంది. మన తల్లిదండ్రులు మన కోసం పడిన కష్టం, తపన, బాధలను గుర్తు చేస్తుంది ఈ పాట చూసినప్పుడు.
నిజంగా మన తల్లిదండ్రులు మనల్ని కని పెంచి ఈ స్థాయిలో వుంచినప్పుడు వారిని తప్పకుండా గౌరవించాలి. మనం ఎంత ఉన్నత ఉద్యోగంలో ఉన్నా, అమెరికా లో ఉన్నా మన తల్లిదండ్రులను పలకరించాలి. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకోవాలి. వారిని వెన్నంటి తోడుగా నిలిచి వృద్ధాప్యంలో చేయి పట్టుకొని వారిని నడిపించాలి. పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులను మాత్రం పలకరించకుండా ఉండవద్దు. వారి కష్టాలను పోగొట్టి వారికి ప్రేమను పంచి రుణం తీర్చుకోవాలి వారి బ్రతికి ఉన్నంత కాలంలో.
ఈ పాటకు లిరిక్స్ శ్రీ బుర్రా వెంకటేషం (ఐఎఎస్) గారు రాశారు. నిజంగా తన తల్లిదండ్రులపై తనకున్న ప్రేమను ఈ పాట రూపంలో మనకు తెలియజేసినట్టు తెలుస్తోంది. గొప్ప సాహిత్యంతో తల్లిదండ్రుల ప్రేమను, వారి కష్టాలను ప్రతి పదములోనూ తెలియజేశారు. ఇక పాటకు సంగీతం, గానం అందించింది Charan Arjun అన్న. ఇప్పటికే తన సొంత ఛానెల్ తో ఎన్నో అద్భుతమైన పాటలు అందించి ప్రతి ఒక్కరి హృదయంలో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఈ పాటతో కూడా అందరి గుండెల్లో తల్లిదండ్రుల ప్రేమను మరోసారి నింపారు.
అమ్మ గీసిన బొమ్మ Song Credits:
Song Name | Amma Geesina Bomma Song (Bvm Creations) |
Lyrics | Sri Burra Venkatesham (IAS) |
Singer – Music | Charan Arjun |
Direction – Dop – Editing | Suresh Suriya |
Supporting Director | SS.SUDHA |
Casting | BVM Sivashankar, Venkata Reddy, Rathnamma, Suresh, Srikar, Krishnamma, Chengal Reddy Gnanashekar, Sai, J.D Nayudu, |
Production Team | Jagadeesh, Sai, Devendra, Balaram |
Bvm Producers | Bailupati Mohan ,Bailupati Hemagiri,Bailupati Babu |
Youtube Video Song | Link |
Amma Geesina Bomma Song Lyrics
అమ్మ గీసిన బొమ్మను నేను..
నాన్న కలల రూపము నేను…(2)
అమ్మ చెక్కిన శిల్పము నేను ..
నాన్న మదిల మేదిలే బావను నేను…
అమ్మ చూపిన కథనే నేను…వు వు
నాన్న చేసిన తొలి ప్రకటన నేను…
అమ్మ గీసిన బొమ్మను నేను
నాన్న కలల రూపము నేను
అమ్మ పాడిన పాటను నేను..
నాన్న రాసిన గీతను నేను..
అమ్మ చేసిన ప్రతిమ నేను..
నాన్న మెచ్చిన ప్రతిభ నేను..
అమ్మ నడిచే బాటను నేను..
నాన్న ఆశల గమ్యం నేను..
అమ్మ ఆత్మ విశ్వాసాన్ని..
నాన్న ఆత్మ గౌరవాన్ని..
అమ్మలోని దీక్షను నేను..
నాన్నలోని దక్షత నేను..
అమ్మ ప్రేమ ప్రతిబింబాన్ని
నాన్న ప్రతిరూపాన్ని..
అమ్మ గీసిన బొమ్మను నేను..
నాన్న కలల రూపము నేను..
అమ్మ గీసిన బొమ్మను నేను..
నాన్న కలల రూపము నేను..
అమ్మలోని శ్రమను నేను..
నాన్నలోని స్వప్నం నేను..
అమ్మ చదివిన చదువు నేను..
నాన్న పొంగిన జ్ఞానం నేను..
అమ్మ నెత్తురు సుక్కను నేను..
నాన్న కండర ముక్కను నేను..
వాళ్ళు కరిగి నీరౌతుంటే ..
పెరుగుతున్న మొక్కను నేను..
అమ్మ ఈ లోకానికి అందించిన కనుక నేను..
నాన్న ముందు తరాలకు ఇచ్చిన హామీ నేను…..
సాయిరాం – @bigboss6telugu714