Amit shah: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో శనివారం జరిగిన విమోచన దినోత్సవం వేడుకలకు కేంద్ర హోమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్స్ సభలో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల గొంతెత్తారు.
Amit shah | టిఎస్ నేతలతో భేటీ!
తెలంగాణ విమోచన దినోత్సవం అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని హరిత ప్లాజాలోని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం BJP పరిస్థితి, మునుగోడు ఉప ఎన్నికలపై షా చర్చించారు. గతంలో పోటీ చేసి గెలవని 19 ఎంపీ స్థానాల గురించి అమిత్ షా రాష్ట్ర నేతలతో చర్చించారు. భువనగిరి, నల్గొండ, మహబూబాద్, నాగర్ కర్నూల్ స్థానాల్లో బీజేపీ ఇప్పటి వరకు విజయం సాధించలేదు. కాగా, ఈ స్థానాల్లో గెలుపుకోసం ముఖ్య నేతలకు అమిత్ షా దిశ నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే సమావేశంలో కేవలం 19 మంది ముఖ్య నేతలతో మాత్రమే భేటీ అయ్యారు. ఇతర నేతలెవ్వరికీ అనుమతి ఇవ్వలేదు.
తాజాగా హైదరాబాద్ MP స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నిలపై కూడా చర్చించారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుత్లో కాషాయ జెండా ఎగురేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో పల్లెల్లో కూడా పార్టీ కార్యక్రమాలు విస్తృత పరిచేందుకు పలు బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ నేతలకు Amit shah ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.