American election polls I ఫ‌లితంపై ప‌రేష‌న్‌!

వాషింగ్ట‌న్‌ : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ముగిసి మూడ్రోజులు గ‌డిచిన‌ప్ప‌టికీ అధ్య‌క్ష పీఠం ఎక్కేది ఎవ‌రో ఇంకా తేల‌ట్టేదు. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న అమెరికా ఫ‌లితాలు విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో తెలియ‌క యావ‌త్తు ప్ర‌పంచాన్ని సందిగ్థంలోకి నెట్టివేసింది. చాలా రాష్ట్రాల్లో ఫ‌లితం వ‌చ్చేసినా జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ క‌రోలినా, అల‌స్కా, నెవాడాల్లో మాత్రం ఇంకా లెక్కింపు కొన‌సాగుతోంది. ఇవి తేలితే గానీ త‌దుప‌రి అమెరికా అధ్య‌క్షుడు ఎవ‌ర‌నేదానిపై స్ప‌ష్ట‌త రాదు. అయితే ఈ ఫ‌లితాలు ఇప్ప‌ట్లో వ‌చ్చేలా క‌న్పించ‌డం లేదు.

American election
AmericaElection

నార్త్ క‌రోలినా, నెవాడాలో ఇంకా బ్యాలెట్ ఓట్ల‌ను స్వీక‌రిస్తుండ‌గా, అల‌స్కాలో ఇంత వ‌ర‌కూ ఎర్లీ ఓటింగ్ లెక్కింపు ప్రారంభం కాలేదు. ఈ సారి ఎన్నిక‌ల్లో పోస్ట‌ల్ బ్యాలెట్స్ భారీగా పోల‌వ‌డ‌మే ఆల‌స్యానికి కార‌ణ‌మైంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోస్టల్ బ్యాలెట్లు మొత్తం పోలైన ఓట్ల‌లో 34 శాత‌మే ఉన్నాయి. దీంతో అప్ప‌టి ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలుపు బుధ‌వారం (ఎన్నిక‌లు జ‌రిగిన మ‌రుస‌టి రోజుకు) నాటికి తేలింది. అయితే కోవిడ్ ప్ర‌భావం కార‌ణంగా చాలా మంది ముందు చేత ఓటింగ్‌కు మొగ్గు చూప‌గా ఈ సారి పోస్ట‌ల్ బ్యాలెట్లు సంఖ్య 68 శాతంగా ఉంది. దీంతో కౌంటింగ్ ఆల‌స్య‌మ‌వుతోంది. 

జార్జియా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు దాదాపు పూర్త‌యిన‌ట్టే క‌న్పిస్తోంది. అయితే ఇక్క‌డ ఆధిప‌త్యం ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య దోబూచులాడుతోంది. ఆది నుంచి ట్రంప్ ఆధిక్యంలో ఉండ‌గా.. తాజాగా బైడెన్ ముందుకొచ్చారు. అయితే వీరి మ‌ధ్య తేడా కేవలం 900 ఓట్లు మాత్ర‌మే ఉండ‌టం గ‌మ‌నార్హం. దీంతో ఎప్పుడేం జ‌రుగుతుందా? అనే ఉత్కంఠత కొన‌సాగుతోంది. మ‌రోవైపు జార్జియా రాష్ట్రంలో బైడెన్ గెలిస్తే, ట్రంప్ అధ్య‌క్ష ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే ట్రంప్ గెలిస్తే మాత్రం అధ్య‌క్ష ఫ‌లితం మ‌రింత ఉత్కంఠంగా మారుతుంది.

నెవాడా రాష్ట్రంలో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇక్క‌డ ఇంకా రెండు లక్ష‌ల‌కు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది. అంతేగాక న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు మెయిల్ బ్యాలెట్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. దీంతో ఇక్క‌డి ఫ‌లితం ఇప్పుడ‌ప్పుడే వ‌చ్చేలా క‌న్పించ‌డం లేదు. అమెరికా కాల‌మానం ప్ర‌కారం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నానికి నెవాడాపై అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ లెక్కింపు పూర్తి కాలేదు.

నార్త్ క‌రోలినా రాష్ట్రంలో దాదాపు 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్త‌యింది. ప్ర‌స్తుతం ట్రంప్‌పై బైడెన్ అత్య‌ల్ప ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. అయితే ఇక్క‌డ కూడా న‌వంబ‌ర్ 12 వ‌ర‌కు మెయిల్ బ్యాలెట్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. దీంతో అప్ప‌టి దాకా గెలుపు ఎవ‌రిద‌నేది చెప్ప‌డం క‌ష్ట‌మే. 

చ‌ద‌వండి :  Minister Vellampalli Srinivas Comments On Ashok Gajapathi Raju|మంత్రి వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం!

అల‌స్కా రాష్ట్రంలో ఫ‌లితం మాత్రం చివ‌రికి వ‌చ్చేలా క‌న్పిస్తోంది. రిప‌బ్లిక‌న్ల‌కు ప‌ట్టున్న ఈ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్క‌డ ఇంత వ‌ర‌కూ అక్టోబ‌ర్ 29 త‌ర్వాత వేసిన ఎర్లీ ఓటింగ్ లెక్కింపు ను ప్రారంభించ‌నే లేదు. ఈ లెక్కింపు పూర్త‌వ్వడానికి మ‌రో వారం రోజులు ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్టు ప‌రిస్థితుల‌ను బ‌ట్టి తెలుస్తోంది. 

కీల‌క రాష్ట్ర‌మైన అరిజోనా రాష్ట్రం ఫ‌లితంపై గంద‌ర‌గోళం త‌లెత్తింది. అమెరికాకు చెందిన వేర్వేరు మీడియా సంస్థ‌లు విభిన్న ఆధిక్యాల‌ను చూపిస్తున్నాయి. కొన్ని ఛాన‌ళ్లు అరిజోనా బైడెన్ సొంత‌మైన‌ట్టు ప్ర‌క‌టించాయి. దీంతో బైడెన్‌కు వ‌చ్చిన ఎల‌క్టోర‌ల్ ఓట్ల సంఖ్య 264కు చేరింది. మ‌రికొన్నింటిల్లో అరిజోనాలో ఇంకా బైడెన్ ఆధిక్యంలో ఉన్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వీటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే బైడెన్ ఓట్ల సంఖ్య 253గానే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో జార్జియా ఫ‌లితం కీల‌కంగా మారింది. 

అన్నింటా అగ్ర రాజ్యంగా పేరొందిన అమెరికా ఓటింగ్ విష‌యానికి వ‌స్తే మాత్రం ప్ర‌పంచంలోనే అత్యంత త‌క్కువ పోలింగ్ శాతం న‌మోద‌య్యే దేశాల్లో ఒక‌టిగా నిలుస్తూ వ‌స్తోంది. ప్యూ రీస‌ర్చ్ ర్యాంకింగ్ గ‌ణాంకాల ప్ర‌కారం ఇటీవ‌ల ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల‌ను చూస్తే పోలింగ్ శాతంలో అమెరికా అట్ట‌డుగున ఉంది. ఎన్నిక‌ల్లో జాతీయ స్థాయి నిబంధ‌న‌లు లేక‌పోవ‌డం, ఎన్నిక‌ల రోజున సెల‌వు ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం, కొన్ని వ‌ర్గాల వారు ఓటేయ‌కుండా ఉన్న అడ్డంకులు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల అమెరికా లో ఓటింగ్ శాతం అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే గ‌తంలో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం 66.9 శాతం పోలింగ్ న‌మోదైంది. ఏదేమైనా అమెరికా త‌దుప‌రి అధ్య‌క్షుడు ఎవ‌రో తేలాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సి ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *