oxygen supply : ఒకపక్క కరోనాతో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుంటే మరో పక్క శవాలపై పేలాలు ఏరుకుంటున్న చందంగా లోకం తీరు ఉంది.కరోనాతో చికిత్స పొందుతున్న రోగులకు ఏకంగా ఆక్సిజన్ సప్లై తీసేసి వారు చనిపోతే ఆ శవాలను తీసుకెళ్లేందుకు గిరాకీ వస్తుందన్న భావనలో కొందరు అంబులెన్స్ డ్రైవర్లు ఉండటం దురదృష్టకరం. ఇది తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఘటన.
oxygen supply : కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే శవాల మీద చిల్లర ఏరుకునే దుర్మార్గులు బయల్దేరారు. తమకు గిరాకీ లేదని ఏకంగా ఐసీయూలోని కరోనా రోగులను చంపేందుకు కూడా వెనకాడలేదు కిరాతకులు. కరోనా రోగులకు సీరియస్ అయనా చనిపోయినా తమకు కిరాయి వస్తుం దని అంబులెన్స్ డ్రైవర్లు అత్యంత కిరాతక చర్యకు పూనుకుంటున్నారు. ఆక్సిజన్ సప్లై ఆపేసి రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఆస్పత్రి వార్డుబాయ్ ఆ దారుణాన్ని చూడటంతో రోగుల ప్రాణాలు నిలిచాయి. ఈ అత్యంత దారుణ ఘటన తెలంగాణలో వెలుగు చూసింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ ఘోరం వెలుగు చూసింది. తమకు కొద్ది రోజులుగా పేషెంట్లు దొరకడం లేదని గిరాకీ పెంచుకునేందుకు ముగ్గురు అంబులెన్స్ డ్రైవర్లు దారుణానికి ఒడిగట్టారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరాని ఆపేశారు. ఆక్సిజన్ స్లపై ఆగిపోవడాన్ని గమనించిన వార్డ్ బాయ్ వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆక్సిజన్ సప్లై ఆపేసిన ఓ ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ను గుర్తించి ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. కొద్ది రోజులుగా అంబులెన్స్లకు గిరాకీ లేదని ఎవరికైనా సీరియస్ అయినా లేకుంటే చనిపోయినా తమకు గిరాకీ వస్తుందని భావించి ఈ పనిచేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను ఆస్పత్రి అధికారులు సీరియస్గా తీసుకున్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!