Ambedkar Exclusive Interview : BBC లో డా.బిఆర్ అంబేద్కర్ అరుదైన వీడియో విడుదల!
Ambedkar Exclusive Interview : భారత రాజ్యంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ గారి అరుదైన వీడియోను BBC ఛానల్ కొద్ది గంటల క్రిందట యూట్యూబ్‌లో విడుదల చేసింది. వాస్తవానికి ఆ వీడియో 2017 సంవత్సరం డిసెంబర్ 8 అప్లోడ్ చేసినప్పటికీ మళ్లీ ఆ వీడియోను BBC అప్డేట్ చేసింది. ఈ వీడియోలో డా.బిఆర్ అంబేద్కర్ ను ఓ బ్రిటీష్ జర్నలిస్టు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అంబేద్కర్ ను ఎక్కడా కూడా ఫొటోలో గానీ, వీడియోల్లో గానీ స్పష్టంగా కనిపించి దాఖలాలు లేవు. కానీ BBC ఛానల్ వారు విడుదల చేసిన ఇంటర్వ్యూ వీడియో లో మాత్రం డా.బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా కనిపిస్తున్నారు. దాదాపు 4.58 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు కనిపించారు.
డా.బిఆర్ అంబేద్కర్ గారిని 1953 సంవత్సరం జూన్ 22న BBC మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూను తీసుకుంది. ఈ ఇంటర్వ్యూలో భారతలో ప్రజాస్వామ్యం భవిష్యత్తు, ఎన్నికల వ్యవస్థ, ఇతర అంశాలపై జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు అంబేద్కర్ గారు సమాధానం ఇచ్చారు. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందా? అని బీబీసి అంబేద్కర్ గారిని ప్రశ్నించగా ప్రజ్వాస్వామ్య వ్యవస్థ నామమాత్రంగా, లాంఛన ప్రాయంగా మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికలు, ప్రధానమంత్రి, ఇతరత్రా అంశాల్నీ ఇందులో ఉంటాయని అంబేద్కర్ గారు బదులిచ్చారు.


BBC ఛానల్లో అంబేద్కర్ గారి వీడియో లింక్!
ఈ వీడియో చూస్తున్న భారత్ ప్రజలు BBC ఛానల్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవని, ఈ వీడియలో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇచ్చిన బిబిసి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ అరుదైన వీడియో లో మాత్రం ఇంటర్వ్యూ ఇంగ్లీష్‌లో ఉంటడం వల్ల కాస్త కొందరికి అర్థం కాక తెలుగులోకి అనువదించగలరని బీబీసీ ఛానల్ వారిని విన్నవించు కుంటున్నారు. ఏదేమైనా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూసే భాగ్యం కల్పించినందుకు మా వెబ్సైట్ ద్వారా బీబీసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు కూడా వీడియోను చూడండి. లింక్ ఇస్తాను.
Ambedkar Exclusive Interview : Video Link
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?