Amba Story | కాశీరాజ్యాన్ని పరిపాలించిన హోత్రహనుడికి అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. వారికి యుక్త వయసు రాగానే, రాజు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు, తన తమ్ముడైన విచిత్రవీర్యుడికి వివాహం చేయడానికి, స్వయం వరానికి వచ్చిన రాజకుమారులందరినీ ఓడించి, రాకుమార్తెలు ముగ్గురునీ బలవంతంగా హస్తినాపురానికి తీసుకుపోయాడు.
అంబ(Amba Story) తాను అంతకు పూర్వమే సాళ్వుణ్ణి వరించినట్టు చెప్పగానే, Bhishmudu ఆమెను అలాగే వెళ్లమని సాళ్వుడి వద్దకు పంపాడు. అయినా, ఒక సారి భీష్ముడు బలవంతంగా అపహరించుకుని పోయిన అంబను పెళ్లాడటానికి సాళ్వుడు నిరాకరించాడు. Amba విచారంతో భీష్ముని వద్దకు తిరిగి వచ్చి, విషయం తెలియ జేసి, తన్ను వివాహమాడమన్నది. అందుకు అతడు సమ్మతించలేదు. ఆఖరికి అతని గురవైన పరశు రాముడు ఆజ్ఞాపించినా Bhishma వివావామాడనన్న తన ప్రతిజ్ఞకు భంగం కలిగించలేనన్నాడు.
తన వివాహాన్ని చెడగొట్టిన భీష్ముడి మీద పగ తీర్చుకోవాలని అంబ శివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేసింది. మరు జన్మలో ఆమె కోరిక నెరవేరే విధంగా శివుడు వరమిచ్చాడు. ఆ వరప్రభావంతో అంబ ద్రుపదరాజపుత్రిగా జన్మించి, బాల్యం నుంచే రాజోచిత విద్యలు నేర్చింది. భారత యుద్ధానికి ముందు యక్షుని ప్రార్థించి, పురుషులక్షణాలను సంపాదించి శిఖండి అయింది. kurukshetramలో జరిగిన భారత యుద్ధంలో, అర్ణునుడు భీష్ముణ్ణి ఎదుర్కొన్నప్పుడు, అర్జునుడి రథం మీద శిఖండి(Amba Story) ఉండటం చూసి, భీష్ముడి ఒక స్త్రీ మీద అస్త్రప్రయోగం చేయడమా? అని అస్త్ర సన్యాసం చేశాడు. అదే అదునుగా తీసుకుని అర్జునుడు భీష్ముణ్ణి పడగొట్టాడు. ఆ విధంగా అంబ పంతం నెరవేరింది.
bramadatta story: సంతానం కలిగిందని సంబరపడితే ఇలాగే ఉంటుంది!
సాల్వరాజైన బ్రహ్మదత్తుడికి చాలా కాలంవరకు సంతానం కలగులేదు. అందువల్ల కులగురువు ఒకనాడు, మన రాజ్యంలోని ప్రజలందరూ మీ సంతానంవంటివారే. వారిలో ఉత్తముడూ, యోగ్యుడూ అయిన ఒకరిని స్వీకరించి, మీ తరువాత సింహాసనాన్ని అప్పగించడం మంచిది. అని రాజుకు సలహా ఇచ్చాడు.
కానీ ఇది బ్రహ్మదత్తుడికి నచ్చలేదు. ఆయన తపస్సు ఆచరించి శివుణ్ణి మెప్పించి, సంతానం కలిగే విధంగా వరాలు పొందాడు. ఆ చిరకాలంలోనే రాజకు హంసుడు, డింభకుడు అనే ఇరువురు కుమారులు కలిగారు. శ్రద్ధగా విద్యాబుద్దులు నేర్పి, వారిని ధర్మార్గంలో పెంచమని, Guruvu రాజుకు చెప్పాడు. అయితే, లేకలేక కలిగిన సంతానం కావడం వల్ల, రాజు పిల్లలపట్ల అమితమైన గారాబం చూపసాగాడు. ఆ కారణం వల్ల హంసడింభకులు అల్లరిచిల్లరగా పెరిగి, జరాసంధుడితో స్నేహం సంపాయించారు.
తపస్సు చేసి, తమను ఎవరూ జయింకుండా ఉండాలని బ్రహ్మ నుంచి వరాలు పొందారు. ఆ వరగర్వంతో సాధువులందరినీ వేధించసాగారు. తమను మించినవారు భూలోకంలో ఉండకూడదన్న అహంభావం వాళ్లకు కలిగింది. తండ్రి చేత రాజసూయం చేయించి, రాజులందరితో పాటు ద్వారకను పాలించే కృష్ణుడికి కూడా, కప్పం తీసుకురమ్మని కబురు పంపారు!


వాళ్ల దుర్మార్గాన్ని సంహించలేక, Krishnudu, వాళ్ల అంతం చూడటానికి ఒక ఉపాయం ఆలోచించాడు. హంసకుణ్ణి రహస్యంగా బంధించి, వాడు మరణించాడన్న పుకారు పుట్టించాడు. ఆ పుకారు డింభకుడి చెవిన పడింది. హంసుడి ఎడబాటును సహించలేక వాడు, Yamuna నదిలో దూకి ప్రాణాలు వదిలాడు. డింభకుడి మరణవార్త విన్న హంసుడు సైతం, సోదరుడు లేని జీవితం మీద విరక్తిపుట్టి బలవన్మరణం పాలయ్యాడు.
కొన్నాళ్లకు కులగురువు రాజును దర్శించి, సంతానం కలిగినంత మాత్రాన సంబరపడి పోకూడదు. వారికి మంచి చెడ్డలు తెలియజెప్పి, ధర్మమార్గంలో పెంచాల్సిన గురుతర బాధ్యతను తల్లిదండ్రులు మరిచి పోకూడదు. బాధ్యతను ఉదాసీనం చేస్తే పర్యవసానం ఇలాగే ఉంటుంది. అన్నాడు. బ్రహ్మదత్తుడు తన అశ్రద్ధకు ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు.