Oxygen : భార‌త్ వెంట Amazon సాయం చేసేందుకు ముందుకు!

Oxygen : భార‌త్ వెంట Amazon సాయం చేసేందుకు ముందుకు!

Oxygen : భార‌త్‌లో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో ప్ర‌భుత్వానికి సాయం చేసేందుకు ప్ర‌ముఖ ఈ – కామ‌ర్స్ దిగ్గ‌జం, ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్‌ ముందుకొచ్చింది. వివిధ పారిశ్రామిక భాగ‌స్వాములు, ఎన్జీవోల‌తో చేతులు క‌లిపి అమెజాన్ 10,000 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, బైలెవ‌ల్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజ‌ర్ (బీఐపీఏపీ) మెషిన్లు భార‌త్‌కు త్వ‌ర‌గా త‌ర‌లించేందుకు సిద్ధ‌మైంది. 8 వేల ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, 500 బీఐపీఏపీల‌ను సింగ‌పూర్ నుంచి వాయుమార్గంలో భార‌త్‌కు త‌ర‌లించేందుకు ఏసీటీ గ్రాంట్స్‌, టెమాసెక్ ఫౌండేష‌న్‌, పూణె ఫ్లాట్ ఫామ్ ఫ‌ర్ కోవిడ్ 19 రెస్సాన్స్ (పీపీసీఆర్‌), ఇత‌ర భాగ‌స్వాముల‌తో అమెజాన్ చేతులు క‌లిపింది.

వీటిని భార‌త్‌కు వీలైనంత త్వ‌ర‌గా త‌ర‌లించేందుకు ఆయా సంస్థ‌ల‌న్నీ భార‌త్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాయి. క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తున్న ఆసుప‌త్రులు, ప‌బ్లిక్ ఇనిస్టిట్యూష‌న్స‌కు వీటిని విరాళంగా ఇవ్వ‌నున్నారు. దేశంలో క‌రోనా ప్ర‌భావం ఊహించ‌డానికి వీలులేనంత‌గా ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో తాము భార‌త్ వెంటే ఉంటామ‌ని అమెజాన్ ఇండియా గ్లోబ‌ల్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్‌, ఇండియా హెడ్ అమిత్ అగ‌ర్వాల్ తెలిపారు. ఈ సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప్రాణాలు కాపాడేందుకు అవ‌స‌ర‌మైన సాయం అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

చ‌ద‌వండి :  Myanmar update : మ‌య‌న్మార్ లో ఆగ‌‌ని నిర‌స‌న‌లు! నిర్భంధంలోనే సూచీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *