Amazing Street Artist | కూటి కోసం కోటి విద్యలు అదే విధంగా కోటి తిప్పలు పడాల్సి వస్తుంది ప్రస్తుతం సమాజంలో. ఉన్నత చదువులు చదివినా job రాక ఎంతో మంది యవతీ యువకులు కెరియర్లో సతమతమవుతున్నారు. కొంత మంది ఇంటి వద్ద యువతీ యువకులు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. మరికొందరు ఇతర ప్రదేశాలకు పనులు చేయడానికి వలస వెళుతున్నారు. ఏది చేసినా జానెడు పొట్ట నింపుకోవడం కోసమే అనేది అందరికీ తెలిసిన విషయం.
Amazing Street Artist
సౌత్ ఆఫ్రికాలోని Suriname కు చెందిన ఒక పెద్దాయన నిమిషాలలో Art గీస్తున్నాడు. తనకు ఉన్న కళానైపుణ్యంతో ఇతరులను మంత్రముగ్దులను చేస్తున్నాడు. ఒక Blue acrylic colour తో ఒక ఆర్ట్స్ గీసే ఫ్రేమ్‌పైన కేవలం చేతులతో బొమ్మ గీస్తున్నాడు. రోడ్డు ప్రక్కన ఉండే ఈ స్ట్రీట్ ఆర్టిస్ట్ చేతితో వేస్తున్న బొమ్మను ఓ వ్యక్తి వీడియో తీసి social mediaలో అప్లోడ్ చేశాడు. అది Video ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలా సన్నగా ఉండే ఈ వ్యక్తి ఒక ప్రదేశంలో కూర్చొని తన ప్రక్కన రంగు బాటిల్ పెట్టుకుని కేవలం చేతి వ్రేళ్లతో బొమ్మలు గీస్తున్నాడు.

ఒక వ్యక్తికి తన బొమ్మను ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ఎదుటనే ఒక ఫ్రేమ్‌పై బ్లూ రంగు వేసి పిచ్చి పిచ్చిగా రుద్దాడు. ఆ తర్వాత తన చేతి నైపుణ్యంతో బొమ్మను గీశాడు. ఈ బొమ్మలో చుట్టూ చెట్లు, మధ్యలో సరస్సు, ఆ సరస్సులో ఒక పడవ, దాని ప్రక్కన మెట్లును క్షణాల్లో గీసి చూపించి హౌరా అనిపించాడు. ఆ సన్నని వ్యక్తి వేసిన బొమ్మను చూసి వీడియో తీసిన వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లో చూసిన నెటిజన్లు కొందరు ఆ పెద్దాయన కళను మెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ వీడియోను 21 మిలియన్లు మంది చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఈ చిత్రం గీయడంపై నెటిజన్లు ఇది ఒక Amazing అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వ్యక్తి Canvas వర్క్‌లో అత్యంత నైపుణ్యం గలవాడని అంటున్నారు. నిజంగా ఆ వ్యక్తి గీసిన చిత్రాన్ని మనం కూడా మెచ్చుకోవాల్సిందే మరీ!. ఇంతకీ ఈ వీడియో ఇప్పటిది కాదులేండి!