Amavasya

Amavasya: అమావాస్య రోజున ఏమి జ‌రుగుతుంది?

Share link

Amavasya | అమావాస్య అంటే క‌టిక చీక‌టి. ఒక భ‌యంక‌ర‌మైన గ‌డియలు అనేది భార‌తీయ ప్ర‌జల‌లో కొంద‌రి హిందువుల‌, ఇత‌ర మ‌త‌స్థుల‌ న‌మ్మ‌కం. అమావాస్య అంటే చంద్రుడు(చంద‌మామ‌) క‌న‌ప‌డని రోజు. ఎవ‌రైనా కానీ, ఏదైనా కానీ లేన‌ప్పుడు వారి ఉనికి శ‌క్తివంత‌మ‌వుతుంది. అలానే చంద్రుడు లేని చీక‌టిలో ఒక భ‌యం క‌నిపిస్తుంది. ఈ రోజు చంద్రుడు క‌నిపించ‌డు.. అంతా చీక‌టే ఉంటుంద‌నే ఆందోళ‌న మొద‌ల వుతుంది. అప్పుడు చంద్రుడు ఉనికి ప్ర‌భావం మ‌రింత పెరుగుతుంది. అమావాస్య కాకుండా వేరే రోజుల్లో అయితే చంద‌మామ క‌నిపిస్తాడు. పౌర్ణ‌మి రోజు కూడా చంద‌మామ మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా క‌నిపించిన‌ప్ప‌టికీ అమావాస్య రోజు మాత్రం చంద‌మామ క‌నిపించ‌డుగా అనే ఆలోచ‌న మ‌దిలో మెద‌లువుతుంది.

సైన్స్ ప‌రంగా Amavasya!

వాస్త‌వానికి సైన్స్ ప‌రంగా చూస్తే భూమి Amavasya రోజు విశ్రాంతి తీసుకుంటుందట‌. ఆ స‌మ‌యంలో భూమిపై ప్ర‌క్రియ నెమ్మ‌దిగా న‌డుస్తుంటుంది. ఇది మంచి ప్ర‌క్రియ అని భావిస్తుంటుంటారు. మ‌రింత లోతుగా విశ్లేషిస్తే అమావాస్య అనే ప‌దం సంస్కృతంలో నుండి వ‌చ్చింది. పురాత‌న బాబిలోనియా, గ్రీకు, భార‌తీయ కేలండ‌ర్ల‌లో తిథులు అని పిలువ‌బ‌డే 30 చంద్ర ద‌శ‌ల‌ను ఉప‌యోగించ బ‌డ్డాయి. చంద్రుడు క‌నిపించ‌ని తిథి అంటే సూర్యుడు, చంద్రుల మ‌ధ్య 12 డిగ్రీల కోణీయ స్థాన బ్రంశం లోప‌ల ఉన్న‌ప్పుడు సంభ‌విస్తుంది. అమ‌వాస్య నెల మ‌ధ్య‌లో వ‌స్తుంది. అవంత మాన కేలెండ‌ర్ ప్ర‌కారం కొన్ని ప్రాంతాల్లో అమావాస్య దినంతో నెల ప్రారంభ‌మ‌వుతుంది. దీపావళి లాంటి కొన్ని పండుగ‌లు ఈ అమావాస్య దినాల‌లో వ‌స్తుంటాయి.

భ‌య‌పెట్టే అమ‌వాస్య గ‌డియ‌!

నెల‌లో అమ‌వాస్య ఎప్పుడు, పౌర్ణ‌మి ఎప్పుడు అని ప్ర‌తి ఇంట్లో కేలండ‌ర్‌ను ప‌రిశీలిస్తూనే ఉంటారు. ఏమైనా శుభ‌కార్యాలు చేయ‌డానికి అమ‌వాస్య గ‌డియ‌లు ఏమైనా ఉన్నాయా? అని ప‌రిశీలించి వాటిని త‌ప్పించి మ‌రో మంచి రోజును ఎంచుకుంటారు. ఇత‌ర దేశాల్లో చంద్రుడు క‌నిపించ‌ని చీక‌టి రోజును ఎలా పాటిస్తారో తెలియ‌దు కానీ మ‌న ఇండియాలో మాత్రం Amavasyaను చాలా జాగ్ర‌త్త‌గా, భ‌యం భ‌యంగా గ‌డుపుతారు. అమ‌వాస్య రోజున క‌టిక చీక‌టి ఉండ‌టంతో మంత్ర‌గాళ్లు అర్థ‌రాత్రి వేళ‌ల్లో తిరుగుతార‌ని మ‌నం వింటుంటాం. అలానే మూడు రోడ్లు క‌లిసే కూడ‌లిలో తీసివేత‌లు, బాగు జేత‌లు పేరుతో ప‌సుపు, కుంకుమ‌, కోడి, గుడ్డు, నిమ్మ‌కాయ‌, అన్నం, కొత్త వస్త్రాలు ఇలాంటివి ప‌డ‌వేస్తుంటారు.

కేవ‌లం ఇలాంటి ప‌నులు కొంద‌రు కావాల‌ని చేస్తున్నారో, మూఢ‌న‌మ్మ‌కాల‌ను ఆచ‌రించే వారిని మ‌రింత భ‌య‌పెట్టాల‌ని చూస్తున్నారో తెలియ‌దు కానీ Amavasya రోజునే ఇలాంటి చేష్ట‌లు చేస్తుంటారు. ఇక తెల్ల‌వారే స‌రికి రోడ్ల‌పైన ఎక్క‌డెక్క‌డో పైన తెలిపిన తీసివేతల ప‌దార్థాలు క‌నిపిస్తుంటాయి. వాటిని న‌మ్మేవారు ఆ ద‌రి దాపుల్లోకి వెళ్ల‌రు. ఒక వేళ వెళ్లినా దానిని చాలా జాగ్ర‌త్త‌గా దాటుకుంటూ వెళ‌తారు. కొంద‌రు ధైర్యంగా కావాల‌నే తొక్కించుకుని స‌ర‌దాగా వెళుతుంటారు. ఈ క్ర‌మంలో భ‌య‌ప‌డేవాడికి దెయ్యం, భూతం లాంటివి అపోహ‌లు గుర్త‌కు వ‌స్తాయి. భ‌య‌ప‌డిని వాడు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటాడు.అమావాస్య అనేది ప్ర‌కృతికి సంబంధించిన ఒక జీవ ప్ర‌క్రియ‌. దానిని అడ్డం పెట్టుకుని ఎంతో మంది మంత్ర‌గాళ్లు డ‌బ్బులు దోచుకుంటున్నారు. మూఢ‌న‌మ్మ‌కాల‌ను పెంచి మ‌రికొంద‌రు వ్యాపారాలు చేస్తూ వ‌స్తువులు అమ్ముతున్నారు. అమావాస్య అనేది చంద్రుడు లేని అంద‌మైన చీక‌టి మాత్ర‌మే కానీ, భ‌య‌పెట్టే స‌మ‌యం ఏమాత్ర‌మూ కాదు.

world facts: తాబేలు నెత్తిన ప‌డి గ్రీకు నాట‌క ర‌చ‌యిత మృతి ఇలాంటి ప్ర‌పంచ వింత‌లు తెలుసుకోండి!

world facts | ప్ర‌పంచ చ‌రిత్ర‌లో జ‌రిగిన కొన్ని నిజ సంఘ‌ట‌న‌లు వింటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఇప్ప‌టి కాలానికి, అప్ప‌టి కాలానికి తేడా తెలుస్తుంది. పాల‌కులు, రాజులు Read more

Husband abaddalu: మ‌గ‌వారు ఎక్కువుగా ఆడ‌వారితో చెప్పే 7 అబ‌ద్ధాలు ఇవేన‌ట‌?

Husband abaddalu | మ‌గ‌వారిలో, ఆడ‌వారిలో ఎవ‌రెక్కువ అబ‌ద్ధాలు చెబుతారో ఊహించండి? ఇంకెవ‌రు ఆడ‌వారంటారా? ఈ విష‌యం ఆడ‌వారితో ఇంకేమైనా ఉందా? కాదండోయ్‌.. ఆడ‌వారిక‌న్నా మ‌గ‌వారే ఎక్కువ Read more

Iron Cot: ఈ ఫొటోలో ఉన్న‌ది ఏమిటో గుర్తు ప‌ట్టారా? ఇక్క‌డ‌కు ఎలా వ‌చ్చింది?

Iron Cot | ఈ ఫొటో చూశారా? ఎవ‌రో ఈ మంచాన్ని అమాంతం ఎత్తుకెళ్లి చ‌క్క‌గా అక్క‌డ పెట్టినట్టు ఉంది క‌దూ. ఇంకా చెప్పాలంటే స‌ర్క‌స్ వారు Read more

Nibba Nibbi: నిబ్బ-నిబ్బి ప‌దాల వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే!

Nibba Nibbi | తెలుగులోని హిందీలోని ఎక్కువుగా యూట్యూబ్‌లో క‌నిపించే ప‌దం నిబ్బా-నిబ్బి. ఈ ప‌దం పై youtube లో ప‌దుల సంఖ్య‌లో వీడియోలు ఉన్నాయి. అస‌లీ Read more

Leave a Comment

Your email address will not be published.