Amala Akkineni Birthday: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరో అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల, బర్త్‌డే సెప్టెంబర్ 12 అనగా నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అక్కినేని కుటుంబం ఫ్యాన్స్, అక్కినేని హీరోల ఫ్యాన్స్ అమల గారికి పుట్టిన రోజు (Amala Akkineni Birthday) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Amala Akkineni Birthday | హ్యపీ బర్త్‌డే అమల అక్కినేని!
అమల అక్కినేని తెలుగు సినిమాలో ఒక్కప్పటి హీరోయిన్. ప్రస్తుతం దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు కోడలు, అక్కినేని నాగార్జున భార్య. వీరిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను యువ హీరో అఖిల్. అక్కి నేని అమల జంతు సంక్షేమ కార్యకర్త, బ్లూక్లాస్ హైదరాబాద్ కన్వీనర్‌గా ప్రస్తుతం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమల మొదటి పేరు అమల ముఖర్జీ. ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. తండ్రి బెంగాళీ. ఆమె పశ్చిమ బెంగాల్‌లో జన్మించింది. ఆమె తండ్రి ఒకప్పుడు ఇండియన్ నేవీలో అధికారి.
54 సంవత్సరాల వయసు ఉన్న అక్కినేని అమల (Amala Akkineni) నాగార్జునకు రెండో భార్య. మొదటి భార్య వెంకటేష్ చెల్లిని చేసుకోగా, వారికి అక్కినేని నాగచైతన్య జన్మించాడు. ప్రస్తుతం అక్కినేని అమలకు, నాగార్జునకు ఒక్కడే కుమారుడు , అతనే అక్కినేని అఖిల్. అమల ఒక ఇల్లాలుగా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదిం చకున్నారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు, జంతువుల సంరక్షణ కార్యక్రమాలు చేపడుతూ దేశవ్యాప్తంగా ప్రముఖంగా పేరు తెచ్చు కున్నారు. అక్కినేని వారి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినప్పటి నుండి హీరోయిన్ పాత్రలకు గుడ్‌బై చెప్పారు. అ తరువాత పలు అమ్మ, అత్త, అక్క పాత్రలలో నటించారు. నటిస్తున్నారు.

