alternatives to personal loansఅత్యవసరంగా డబ్బు అవసరం ఏర్పడిన పరిస్థితుల్లో ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వ్యక్తిగత రుణాలే. అయితే వీటిపై వడ్డీ రేటు 15 నుంచి 20 శాతం వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కింది ప్రత్యామ్నాయాలకు వెళితే అంత కంటే చౌకగానే నిధులు (alternatives to personal loans) సమకూర్చుకోవచ్చు.
టాప్ అప్ గృహ రుణం
మీరు ఇప్పటికే గృహ రుణ బకాయిలు చెల్లిస్తుంటే, దానిపై అదనంగా టాప్ అప్ లోన్ తీసుకోవడం మంచిది. ఈ టాప్ అప్ లోన్ని ఎలా వినయోగించుకోవాలనే దానిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. అయితే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు గృహ రుణ నెలవారీ వాయిదాలు (EMI) చెల్లించిన ఖాతాదారులే ఈ టాప్ అప్ రుణాన్ని తీసుకునేందుకు అర్హులు. మీరు తీసుకున్న గృహ రుణాన్ని మినహాయిస్తే ఇంటి మార్కెట్ విలువ ఎంత ఉంటుందో అందులో 75 నుంచి 80 శాతం వరకు ఈ టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. గృహ రుణాలతో పోలిస్తే ఈ లోన్లపై వడ్డీ రేటు కొద్దిగా ఎక్కువుగా ఉంటుంది. వ్యక్తిగత రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటుతో పోలిస్తే మాత్రం చౌకే. ఉదాహరణకు ఎస్బిఐ హోమ్ లోన్లపై 9.55 శాతం వడ్డీ వసూలు చేస్తుంటే టాప్ అప్ లోన్లపై, అంతకంటే కొద్దిగా ఎక్కువుగా 9.80 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. అదే వ్యక్తిగత రుణాలకి వచ్చే సరికి 12.7 శాతం దగ్గరి నుంచి ప్రారంభమవుతుంది. ఈ టాప్ అప్లోన్ను 15 నుంచి 20 సంవత్సరాల్లో, లేదా మిగిలిన హోమ్ లోన్(HOME LOAN) చెల్లించే లోపు ఏది ముందైతే ఆ లోపు చెల్లించాలి. అదే వ్యక్తిగత రుణాలైతే చెల్లించేందుకు సాధారణంగా ఏడేళ్ల వరకు గడువు ఉంటుంది.


ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణం
మీకు ఏదైనా బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఆ డిపాజిట్పైనా రుణం తీసుకోవచ్చు. కాకపోతే డిపాజిట్‌పై బ్యాంక్ చెల్లించే వడ్డీ రేటు కంటే మీరు తీసుకునే రుణంపై వడ్డీ రేటు ఒకటి నుంచి మూడు శాతం వరకు ఎక్కువుగా ఉంటుంది. ఉదాహరణకు ఎస్బిఐ ఒక సంవత్సరం కాలపరిమితి గల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఆ డిపాజిట్‌పై మీరు రుణం తీసుకోవాలంటే ఒక శాతం ఎక్కువుగా వడ్డీ చెల్లించాలి. ఫిక్సడ్ డిపాజిట్ మొత్తం లో 85 నుంచి 90 శాతం వరకు రుణంగా తీసుకోవచ్చు.
ఆస్తులపై రుణం
మీ పేరు మీద ఉన్న వాణిజ్య లేదా నివాస ఆస్తులు తాకట్టు పెట్టి కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఆస్తి విలువ లో 60 శాతం వరకు రుణంగా లభిస్తుంది. ఈ తరహా రుణాలపై బ్యాంకులు 11.30 నుంచి 13 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తాయి.


సెక్యురిటీల హామీపై రుణాలు
మీ దగ్గర ఉన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, బీమా పాలసీలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, కిసాన్ వికాస్ పత్రాలు వంటి సేవింగ్ బాండ్స్‌ను హామీగా పెట్టి కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే బ్యాంకులు మన దగ్గర ఉన్న అన్ని కంపెనీల షేర్లపైనా, మ్యూచువల్ ఫండ్ సంస్థల పథకాలపైనా రుణాలు ఇవ్వవు. ఏయే కంపెనీల షేర్లు, ఏయే మ్యూచువల్ ఫండ్ సంస్థల పథకాల యూనిట్లపై రుణాలు ఇచ్చేది ఆయా బ్యాంకు శాఖల్లో కనుక్కోవాలి. లేదా ఆయా బ్యాంకుల వెబ్సైట్లలోనూ ఈ వివరాలు లభిస్తాయి. ఈ సెక్యుటీల హామీపై ఎంత మొత్తం రుణం లభిస్తుందనే విషయం కూడా ఆయా బ్యాంకులను బట్టి ఉంటుంది. వాటి మార్కెట్ విలువలో ఒక్కో బ్యాంకు ఒక్కో మొత్తాన్ని రుణంగా ఇస్తుంది. ఇలాంటి రుణాలపై బ్యాంకులు సాధారణంగా 9.5 నుంచి 14 శాతం వరకు వడ్డీ రేటు వసూలు చేస్తుంటాయి.
పిపిఎఫ్(PPF)హామీపై రుణం
పన్ను ఆదా కోసం పొదుపు చేసే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్ ) పత్రాల హామీపైనా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. పిపిఎఫ్ ఖాతా ప్రారంభమైన మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న మొత్తంపై మాత్రమే ఈ రుణం లభిస్తుంది. ఖాతా ప్రారంభించిన ఏడో సంవత్సరం నుంచి మాత్రం పిపిఎఫ్ హామీపై బ్యాంకులు చిల్లి గవ్వ కూడా అప్పుగా ఇవ్వవు. ఎందుకంటే ఏడో ఏడాది నుంచి పిపిఎఫ్ ఖాతాదారుడు పాక్షికంగా నగదు మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. పిపిఎఫ్ హామీగా ఇచ్చే రుణాలపై బ్యాంకులు పిపిఎఫ్ పై చెల్లించే వడ్డీ రేటు కంటే రెండు శాతం వరకు వడ్డీ ఎక్కువుగా వసూలు చేస్తాయి. ఈ రుణాల అసలు మొత్తాన్ని మూడేళ్లలో చెల్లించాలి. వడ్డీని మాత్రం అసలు మొత్తాన్ని చెల్లించాక రెండు వాయిదాల్లో చెల్లించాలి.


బంగారంపై(GOLD LOAN)రుణం
బంగారు నగలు, నాణేలను తాకట్టు పెట్టి అతి తక్కువ కాలంలోనే బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఇందుకోసం పెద్దగా పేపర్ వర్క్ కూడా ఉండదు. వాల్యూవర్ ఉంటే కొన్ని బ్యాంకులు గంటలో గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. ఈ రుణాలపై వడ్డీ 12.5 నుంచి 14 శాతం వరకు ఉంటుంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వీటిని త్వరగా అంటే ఏడాదిలోపే చెల్లించాలి.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!