Allu Arha dance | ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తూ తగ్గేదెలే..అంటున్న హీరో అల్లు అర్జున్ కు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ మామూలుగా లేదు. ఎక్కడ వీడియోలు చూసినా పుష్ఫ డైలాగ్‌లే వినిపి స్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ పుష్ప డైలాగ్, డ్యాన్స్‌తో పాపులార్ అవుతున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున గారాల పట్టీ అల్లు అర్హ కచ్చా బాదం సాంగ్‌కు డ్యాన్స్(Allu Arha dance) వేసింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. చిన్నప్పటి నుంచి తండ్రిని అనుసరిస్తూ పాటలకు స్టెప్పులేస్తూ అర్హ చిన్న సెలబ్రిటీగా మారింది.
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అల్లు అర్హకు సినిమాలపై మక్కువ బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తండ్రికి తగ్గ తనయురాలుగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఇక కచ్చా బాదం సాంగ్‌కు అచ్చం పెద్దవారు వేసినట్టే డ్యాన్స్ వేసింది. ఈ వీడియోను చూసిన అల్లు అర్జున్ అభిమానులు తగ్గేదెలే..అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదో ఒక వీడియోతో వైరల్ అవుతున్న అల్లు అర్హ ఇటీవల వాళ్ల డాడీ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. తన తండ్రి పుష్ప ప్రీ రిలీజ్ ఇవెంట్లో అన్న చెల్లెలు సందడి చేశారు. ఈ ఫంక్షన్లో తగ్గేదెలే…అంటూ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను, అభిమానులను ఈలలు వేసేలా చేశారు.

- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ