khammam New Bus Stand opening: Khammam: కోట్లు విలువైన ఖమ్మం పాత బస్టాండ్‌పై కొందరు పెద్దలు కన్ను వేశారని, ఖమ్మం పాత బస్టాండ్ ను సిటీ బస్‌గా కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది. ఆదివారం సాయంత్రం సిపిఎం పార్టీ కార్పొరేటర్, మాజీ ఖమ్మం మున్సిపల్ ఛైర్మన్ అఫ్రోజ్ సమీనా ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. నగరం చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలు హాస్పిటల్ కోసం, పలు రకాల పనులు కోసం రోజు వేలాది మంది వచ్చి వెళుతున్నారని తెలిపారు.
పాత బస్టాంట్ పై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాటమార్చారని అన్నారు. అసెంబ్లీలో కొత్త బస్టాంట్ను హైటెక్ బస్టాండ్‌గా, పాత బస్టాండ్‌ను సిటీ బస్టాండ్‌గా కొనసాగిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ రోజు మాత్రం పాత బస్టాండ్‌ను ఖాళీ చేయించారని అన్నారు. ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి, స్థానికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పాత బస్టాండ్ ను స్థానిక బస్టాండ్‌గా కొనసాగించాలని, కొత్త బస్టాండ్‌ను ఎక్స్‌ప్రెస్ బస్టాండ్‌గా ఉంచాలని డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ బేస్ చేసుకొని అనేక మంది చిరు వ్యాపారులు, ప్లాట్‌ఫాం వ్యాపారులు, తోపుడు బండ్ల వారు మొదలు కొని పెద్ద వ్యాపారుల వరకు బ్రతుకుదెరువు కోసం పెట్టుకున్న వ్యాపారాలు నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు.
ఈ పాత బస్టాండ్ ప్రాంతమంతా వ్యాపార సముదాయంగా ఉండి, నగరానికి గుండెకా యగా ఉందన్నారు. ఈ వన్‌టౌన్ పరిధిలో ఉన్న కలెక్టరేట్, నగర కార్పొరేషన్ కార్యాలయం, బస్టాండ్ కూడా తరలించబడితే లక్ష మంది నివాస, మరో లక్ష మంది వ్యాపారులపై ఆధారపడి జీవించి బ్రతికే వారి ఉపాధి దెబ్బ తింటుందని తెలిపారు. పాత బస్టాండ్‌ను స్థానిక బస్టాండ్‌గా కొనసాగించాలని లేకుంటే పెద్ద ఎత్తున ప్రజల తరుపున ఉద్యమించనున్నట్టు పేర్కొన్నారు.


ఇది చదవండి:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు!
ఇది చదవండి: ఫాస్టాగ్ పై కేంద్రం కొత్త నిబంధనలు..ఇక జరిమానానే!
ఇది చదవండి: నాగచైతన్య ఖాతాలో మరో కొత్త లవ్‌స్టోరీ సాంగ్!
ఇది చదవండి:బాలయ్యపై అందుకే అమితమైన ప్రేమ!
ఇది చదవండి:ఇల్లందు మైన్స్‌లో ఆచార్య షూటింగ్!
ఇది చదవండి:మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీకి షాక్!