Alivelu manga : Palvancha: పాత పాల్వంచలోని ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో నాలుగు రోజుల పాటు జరుగుతున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన, బాల భోగ నివేదన, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ట, మండప ఆరాధనలు, ధ్వజారోహణ, గరుఢ ముద్ద, భేరి పూజ, హోమములు, బలహరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు. గరుఢ ముద్ద అనే ప్రత్యేక పూజ సంతానం లేని దంపతులకు చేయించారు. దేవాయలం ప్రధాన పూజారి కందాల ఆనంద్ కుమార్ నేతృత్వంలో పూజలు జరిగాయి.

పూజలో పాల్గొన్న వనమా దంపతులు
బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవాయలంలో జరిగిప ప్రత్యేక పూజల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, సతీమణి పద్మావతి పాల్గొనిపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్వాల సత్యనారాయణ, కూరపాటి రామశేషం రాజు (పెద్దరాజు) , కిలారి సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి:పాత్రలో లీనమై నిజంగానే చంపబోయిండు!
ఇది చదవండి:మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
ఇది చదవండి:భార్యపై ప్రేమ..నిలువెత్తు విగ్రహం ప్రతిష్టత
ఇది చదవండి:రోడ్డు ప్రమాదంలో 50 గొర్రెలు మృతి
ఇది చదవండి:మిస్సైన బంగారం దొంగలు దొరికారు!