alert news: కృష్ణా : రాబోయే మూడు రోజుల పాటు కృష్ణా జిల్లా తీర ప్రాంత మండలాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ కోరారు. ఆగష్టు 21వ తేదీ నుంచి ఆగష్టు 24వ తేదీ వరకు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ శనివారం సాయంత్రం ఒక ప్రకటన చేశారు.


ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం(alert news)గా ఉండాలని తీరప్రాంతంలోని అన్ని మండలాల్లోని తహశీల్దార్లు అందరూ ఆయా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ నెల 24వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని సముద్ర తీరప్రాంత తహశీల్దార్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గ్రామాల్లో పరిస్థితిని గమనించడానికి గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ స్థాయి కార్యదర్శులందరూ తమ గ్రామాలలోనే ఉండాలని ఆదేశించారు. అవసరమైతే గుర్తించిన కేంద్రంలో పునరావాసం కల్పించాలన్నారు. లోతట్టు ప్రదేశాలలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి వారిని తరలించడానికి తగిన ఫంక్షన్ హాల్ / పాఠశాలలు మొదలైనవి గుర్తించాలన్నారు.
భారీ వర్షాలు, వాటితో పాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున లంక గ్రామాలను కలిగి ఉన్న తహశీల్దార్లు మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖతో సంప్రదింపులు జరిపి పడవలు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు.


- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!