albert einstein brain

albert einstein brain:ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మ‌హ‌నీయుడు!ఎందుకంటే?

Spread the love

albert einstein brain ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్ మ‌హాశ‌యుడు 1878 మార్చి 14న జ‌ర్మ‌నీలోని ఉల్మ్ అనే న‌గ‌రంలో జ‌న్మించాడు. విచిత్రం ఏమిటంటే మూడో సంవ‌త్స‌రం దాటేదాకా ఐన్‌స్టీన్‌కు మాట‌లు రాలేదు. త‌ల్లిదండ్రులు బాధ‌ప‌డ్డారు. త‌ల్లి గొప్ప సంగీత విద్వాంసురాలు. కొడుకునే ఒళ్లో పెట్టుకుని సంగీతం పాడుతూ ఐన్‌స్టీన్‌కు నేర్పే ప్ర‌య‌త్నాలు చేసేది. ఆరో సంవ‌త్స‌రం త‌ర్వాత ఐన్‌స్టీన్‌కు మాట‌లు వ‌చ్చాయి. తండ్రి వ్యాపారం పూర్తిగా దివాలా తీయటంతో ఇటలీ దేశంలో అదృష్టం ప‌రీక్షించుకుందామ‌ని అక్క‌డికి వెళ్లారు. కానీ అక్క‌డా చుక్కెదురే అయింది. ఐన్‌స్టీన్ మేన‌మామ జాకబ్ ఐన్‌స్టీన్‌ను స్విట్జ‌ర్లాండ్ తీసుకెళ్లి అక్క‌డ ఫెడ‌ర‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో సీటు ఇప్పించి, చ‌ద‌వించాడు. చ‌దువు త‌ర్వాత జ‌ర్మ‌నీ పౌర‌స‌త్వాన్ని వ‌దులుకుని ఐన్‌స్టీన్ స్విస్ పౌరుడిగా మారాడు. అక్క‌డ బెర్నె అనే ప‌ట్ట‌ణంలోని ఒక పేటెంట్ ఆఫీసులో ఉద్యోగం సంపాదించుకుని చేస్తున్నా ఆయ‌న‌లో ఏదో సాధించాల‌న్న త‌ప‌న (albert einstein brain)చ‌ల్లార‌లేదు.

ఆ త‌ర్వాత ఆ ఉద్యోగాన్ని కూడా వ‌దులుకుని సొంత ఇంటిలోనే త‌న మేథ‌స్సుకు ప‌దును పెట్టాడు. అప్పుడు ఉద్భ‌వించిందే సాపేక్ష సిద్ధాంతం. ప్ర‌పంచాన్ని ఉర్రూత‌లూగించిన ఆ సిద్ధాంతం ఆధారంగా ఎన్నో గొప్ప‌గొప్ప ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రిగాయి. శాస్త్ర‌వేత్త‌ల‌లోని ఐన్‌స్టీన్ అగ్ర‌గ్రామిగా పేరు తెచ్చుకున్నాడు. నోబెల్ బ‌హుమ‌తి ఇంటికి వెతుక్కుంటూ మ‌రీ వ‌చ్చింది. ఎన్నో అవార్డులు కుప్ప‌లుగా వ‌చ్చి ప‌డ్డాయి. ఎన్నో స‌న్మానాల‌కు ఆహ్వానాలందాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మ‌హాశ‌యుడు ఐన్‌స్టీన్ ప‌త్రికా విలేక‌ర్లు భావిత‌రాల‌కు సందేశం ఇవ్వ‌మ‌ని కోరిన‌ప్పుడు ఆయ‌న విన‌మ్రంగా చెప్పిన సమాధానం ఏమిటంటే, ”నేనేదో సైన్సులో చాలా సాధించాన‌ని అనుకున్నాను. చాలా విష‌యాలు తెలుసు అనుకున్నాను. కానీ నాకిప్పుడు తెలిసింది ఏమిటంటే నాకేమీ తెలియ‌ద‌ని, నేను సాధించిన‌దేమీ లేద‌ని, నేను చేసిన దాన‌ధ‌ర్మాలు ఒక లెక్క‌లోకి రావ‌ని, ఈ ప్ర‌పంచంలో క‌నుక్కోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. కోట్లాది ప్ర‌జ‌లు పేద‌రికంలో మ‌గ్గిపోతున్నారు. భావిత‌రం చేప‌ట్టాల్సిన బాధ్య‌త‌లు ఎన్నో ఉన్నాయి. పేద‌వారిని ఆద‌రించండి.’‘ అంటూ ఆ మ‌హాశాస్త్ర‌వేత్త తెలియ‌జేశాడు. ఆయ‌న 1955లో మ‌ర‌ణించాడు.

keyhole Surgery: కీహోల్ స‌ర్జ‌రీతో సుర‌క్షితంగా tumor తొల‌గింపు విధానం!

keyhole Surgery | మెద‌డు లేక సెంట్ర‌ల్ స్పైయిన్ క‌ణాల‌లో క్ర‌మం లేని పెరుగుద‌ల వ‌స్తే, ఆ ఎదుగుద‌ల‌ను బ్రెయిన్ ట్యూమ‌ర్స్ అంటారు. ఇవి మెద‌డు ప‌ని Read more

Meditation benefits on brain:నువ్వు మాన‌సికంగా బాగుండాలంటే ధ్యానం స‌మ‌ర్ప‌యామి

Meditation benefits on brainమ‌న‌సు ప్ర‌శాంతంగా ఉన్న‌ప్పుడే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (life is beautiful) అనిపిస్తుంది. కానీ ఖ‌ర్చు లేకుండా నిఖార్స‌యిన ప్ర‌శాంత‌త దొర‌కాలంటే మాత్రం Read more

Veda Vyasa: చీక‌టిని తొల‌గించే శ‌క్తి గురువు వేద‌వ్యాసుడు Guru Purnima గురించి చెప్పిన నీతి సూత్రం ఇదే!

Veda Vyasa | ఏక‌రాశిగా ఉన్న వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించి వ్యాసుడు Veda Vyasaడిగా పేరొందారు. అష్టాద‌శ పుర‌ణాల‌ను, 18 ఉప పురాణాల‌ను, విజ్ఞాన స‌ర్వ‌స్వ‌మైన Read more

talk skills: ఇత‌రుల‌తో మీరెలా మాట్లాడుతున్నారు? మాట్లాడ‌టమూ ఒక క‌ళే తెలుసా మీకు?

talk skills | మాట్లాడ‌టం ఒక క‌ళ అయితే విన‌డం అంత‌కంటే గొప్ప క‌ళ‌. మాట్లాడేవారి మ‌న‌సు మంచిగంధంలా గుబాళిస్తే, వినేవారి హృద‌యం ఆ మాట‌ల సువాస‌న‌లో Read more

Leave a Comment

Your email address will not be published.