Alarm Bed: ఎత్తెత్తి ప‌డ‌వేసే అలారం బెడ్‌..నిద్ర ప‌రార్‌!

Alarm Bed: మీరు ఉద‌యాన్నే నిద్ర లేవాలంటే మీకు చక్క‌ని ప‌రిష్కారం దొరికిందం డోయ్‌..అదే అలారం బెడ్‌తోని. మీరు కూడా అలారం బెడ్‌ను త‌యారు చేయించుకోండి. ఇక స‌మ‌యానికే నిద్ర లేచి ఆఫీసుకు వెళ్లొచ్చు.

మ‌నం ప్ర‌తిరోజూ నిద్ర లేవాలంటే కాస్త బ‌ద్ధ‌కిస్తూనే ఉంటాం!. అదీ పిల్ల‌లైతే ఇక వారి గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉద‌యం సుప్ర‌భాతం పాడిన‌ట్టు ప్ర‌తిరోజూ వారిని నిద్ర లేప‌డానికి అమ్మా, నాన్న‌, లేక ఇత‌ర కుటుంబ స‌భ్యులు ప‌డే ఇబ్బంది అంతా ఇంతా కాదు. నాన్న తెల్లారింది లేమ్మా! అన‌గానే హా! అంటాం…మ‌ళ్లీ నిద్ర‌లోకి జారుకుంటుంటాం!. అలా నిద్ర‌లోకి జారుకోగానే మ‌ళ్లీ పిలుపు వ‌స్తుంది. ఈ సారి మ‌ళ్లీ దుప్ప‌టి త‌న్ని మ‌రీ ప‌డుకుంటాం.

ఇలా ఒక‌టి రెండు, రెండుకు మూడు పోయి 10 పిలుపులు వ‌చ్చి చివ‌ర‌కు స‌హ‌నం కోల్పోయిన అమ్మ‌, నాన్న తిట్ల దండ‌కం మొద‌లు పెడితే కానీ అప్పుడు మెలుకువ రాదు. ఇదంతా మ‌న ఇళ్ల‌ల్లో ప్ర‌తిరోజూ జ‌రిగే నిత్యం మొద‌టి కార్య‌క్ర‌మం. అయితే కొంద‌రు మాత్రం ఆఫీసుకు లేటుగా వెళ్ల‌డంతో బాస్‌లు చివాట్లు పెడ‌తారు. ఈ బాధ భ‌రించ‌లేక ఇక అలారం పెట్టుకుంటుంటారు. రేపు ఎలాగైనా 5 గంట‌ల‌కు నిద్ర లేవాల‌ని ప‌డుకునే ముందు అనుకుంటారు. తెల్లారేస‌రికి అలారం మోగితే దానిని నొక్కి ప‌క్క‌న పెడ‌తారు.

ఆ త‌ర్వాత హ‌డావుడి చేస్తారు. మ‌ళ్లీ ప్ర‌తిరోజూ లాగానే ఉరుకులు ప‌రుగుల జీవితం. గ‌తంలో అలారం గ‌డియారాలు కొనుకున్నే వారు. ఇప్పుడు చేతిలో యాండ్రాయిడ్ ఫోన్ ఉండ‌టంతో అందులోనే అలారం(Alarm Bed) పెట్టుకుంటున్నారు. కానీ రాత్రి అంతా చాటింగ్‌లు, సోష‌ల్ మీడియాలో స‌మ‌యం గ‌డిపి ప‌డుకునే ముందు ఫోన్‌ను సైలెంట్ పెట్టి నిద్ర‌పోతారు. ఉద‌యాన్నే ఆల‌స్యం కావ‌డంతో ఆ ప‌రుగుల జీవితం మామూలుగా చెప్ప‌న‌క్క‌ర్లేద‌నుకోండి.

Alarm Bed: ఎత్తెత్తి ప‌డ‌వేసే అలారం బెడ్‌

అయితే ఉద‌యాన్నే నిద్ర లేవ‌డానికి ఇన్ని పాట్లు ప‌డే వారికి ఒక అద్బుతమైన అవ‌కాశం వ‌చ్చింద‌డోయ్‌. అదే అలారం బెడ్‌. ఎప్పుడూ అలారం చెవి ప‌క్క‌న మోగుతుంటే మ‌న‌కు ఏమీ ప‌ట్ట‌న‌ట్టు బెడ్ మీద హాయిగా నిద్ర‌పోతాం క‌దా!. కానీ ఇప్పుడు ఏకంగా బెడ్‌కు అలారం ఉంటే, ఇక నిద్ర ప‌రార్ అయిన‌ట్టే ఉంటుంది. బెడ్‌కు అలారం ఉంటే మ‌న‌ల్ని ఎత్తెత్తి లేచే వ‌ర‌కు అలానే చేస్తుంది. ఆ ఎత్తి ప‌డేయ‌డంతో మ‌న‌కు నిద్ర పోతుంది. ఇక నిద్ర పోవ‌డానికి ఆ బెడ్ ఏమాత్రం అంగీక‌రించ‌దు. ఈ ఐడియా ఎవ‌ర‌దో కానీ
ఇలా త‌యారు చేశారు అలారం బెడ్‌ను.

ఈ అలారం బెడ్ వీడియో ఒక‌టి నెటింట్లో వైర‌ల్ అవుతుంది. అబ్బ‌..ఈ అలారం బెడ్, నాకు కూడా కావాల‌ని అంటున్నారు జ‌నాలు. ఈ అలారం బెడ్ వీడియోలో పిల్ల‌వాడిని ఎత్తెత్తి ఎగిరి ప‌డేయంతో పిల్ల‌వాడు నిద్ర‌నుండి మేల్కొంటాడు. వీడియో చూస్తే నిజంగా నిద్ర కూడా మాయ‌మైపోయినంత ప‌నైంది. మ‌రి ప్ర‌శాంతంగా నిద్ర ప‌ట్టేవారికి ఈ అలారం బెడ్ (Alarm Bed) పెద్ద స‌వాల్‌గానే మారుతుంది మ‌రీ!.

Share link

Leave a Comment