Alai Balai Song: హర్యానా రాష్ట్రం గవర్నర్, తెలంగాణ బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఈ ఏడాది(2022) జరిగింది. ఈ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి పలు పార్టీల నేతలు, సినీ ప్రముఖులు(మెగస్టార్ చిరంజీవి) హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ ఒకచోట కలిసి అలయ్ బలయ్ చేసుకొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా Mangli పాడిన అలయ్ బలయ్ పాట ఈ కార్యక్రమానికి సుస్వాగతం తెలిపింది.
సింగర్ మంగ్లీ పాడిన ఈ పాట తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మందికి నచ్చింది. ఈ పాటలో మంగ్లీ నాయకుల మంచితనాన్ని సూచిస్తూ కలిసిమెలిసి ఉండే విధానాన్ని, భారతీయ సంస్కృతిని తెలియజేస్తుంది. ఈ పాటకు లిరిక్స్ తిరుపతి మాట్ల అందించారు. అసలు అలయ్ బలయ్ అంటే ఈ పాటలో తన పదాలతో వినిపించారు. పాటను సింగర్ మంగ్లీ అద్భుతంగా పాడారు. పాడటంతో పాటు డ్యాన్స్ కూడా వేసి అబ్బురపరిచారు.
ఈ సాంగ్‌కు మదీన్ సంగీతం అందించారు. పాటకు తగ్గట్టుగా మ్యూజిక్ అందించి ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా Alai Balai Song ను హిట్ చేశారు. ఇక లాస్య డ్యాన్స్ ఫెర్మామెన్స్ పాటకు హైలెట్‌గా నిలిచింది. పాటలో తన డ్యాన్స్‌తో ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. స్పీడ్ డ్యాన్స్‌తో పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ దూందాంగా ఆడారు. కొరియోగ్రఫీ ప్రశాంత్ చాలా బాగా అందించారు. ఎక్కడా కూడా పాట బోర్ కొట్టకుండా ముందుకు తీసుకెళ్లారు.
అలయ్ బలయ్ కార్యక్రమం అయిపోయినప్పటికీ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పాట వినడానికి బాగుండటంతో అందరూ ఇష్టపడుతున్నారు. మంగ్లీ పాడిన పాటల్లో ఎక్కువుగా హుషారెక్కించే సాంగ్స్ ఉంటాయి. ఈ పాట కూడా మంగ్లీ పాడి తన అభిమానులను హుషారెక్కించారు. మొత్తంగా పాటకు మంచి ఆదరణ లభించింది. ఈ పాటను డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇస్తాము.
ఇక దత్తాత్రేయ గురించి చెప్పాలంటే తెలంగాణ నాయకుల్లో ఒక మంచి మానవత్వం ఉన్న నాయకుడిగా పేరుగాంచారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. బిజెపి పార్టిని వెన్నంటి ఉండి ఎన్నో ఉన్నత పదవులలో ప్రజలకు సేవలు చేశారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమం కూడా బండారు దత్తాత్రేయ తెచ్చిందే. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు.
మొత్తంగా Alai Balai Song లో తిరుపతి అన్న రచన, మంగ్లీ వాయిస్, లాస్య డాన్స్ కలగలిపి అదరహో అనిపించారు. మంగ్లీ అఫిసియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ఈ సాంగ్ ను కొన్ని లక్షల మంది చూశారు. వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఈ పాటను యూట్యూబ్‌లో చూడాలంటే లింక్ ఉంది చూడండి.
Alai Balai Song Credits:
Song Name | Damu Reddy |
Lyrics | Tirupathi Matla |
Singer | Mangli |
Rap lyrics & Vocal | Mama Sing |
Music | Madeen |
Dop | Tirupathi |
Editing | Prabhu Deva |
Cherographer | Prashanth |
Lead Dancer | Lasya |
Execution | Naveen Reddy |
Mixing & Master | Ram Gandikota |
DI | Sanjeev (Rainbow Post) |
Poster Designs | Rana |
Youtube Video Song | Link |