Akrama Madyam | మద్యం ఆరోగ్యానికి హానికరం..ఇది నిజమే. కానీ మద్యం లేకుండా రోజు గడవడం కష్టం నిత్యం తాగేవారికి. పగలంతా కష్టపడి అలసిపోయి నొప్పులు తెలియకుండా నిద్రపోవాలంటే, తిరిగి మరుసటి రోజు లేవాలంటే కచ్చితంగా ఒక పెగ్గు వేసే వారు లేకపోలేదు. కష్టపడుతున్నారు.. తాగుతున్నారు..మళ్లీ కష్టపడుతున్నారు..ఇది వారి రోజులో దినచర్యగా మారింది. మరికొంత మంది మాత్రం కేవలం మద్యం కోసమే బ్రతుకుతున్నట్టు నిత్యం తాగుతూ ఏ పనీ చేయకుండా నిత్యం పెళ్లాన్ని, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే వారు లేకపోలేదు.
Akrama Madyam ధ్వంసం
ఇలా నిత్యం మద్యం తాగే వారితోనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. బ్లాక్‌లో అమ్మే వారికి సంపాదన పెరుగుతుంది. ఏ Businessకు రాని అంత డబ్బులు ఈ మద్యం షాపులకే వస్తున్నాయంటే రోజుకు ఎంత మద్యం అమ్ముడు పోతుందో అమ్మేవారికే తెలుసు. ఇక అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆశతో పోలీసుల కళ్లు గప్పి సరిహద్దులు దాటించే మద్యం(Akrama Madyam) గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. వింటూనే ఉంటాం. అయితే ఇలా మద్యంను అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడు తున్న వారి నుండి మద్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు ఫైలు చేస్తున్నారు. ఇక్కడ ఇలా పట్టుబడిన అక్రమ మద్యం ఫొటోనే మనం ఇప్పుడు చూస్తున్నాం!.
ఈ దృశ్యం ఏపీలో కనిపించింది. ఏపీలో నిత్యం మద్యం నిషేధం చేయాలంటూ పార్టీలన్నీ ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేస్తున్నా, మరో ప్రక్క మాత్రం ఇలా మద్యం(Akrama Madyam) ఏరులై పారుతున్న వాస్తవాలు మద్యం ఎంతలా అమ్ముడు పోతుందో తెలుస్తోంది. APలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎన్ఫోర్మెంట్ అధికారులు 30 లక్షల అక్రమ మద్యంను నిన్న ధ్వంసం చేశారు. గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల పట్టణ పరిధిలోని ఐదో వార్డులో గల డంపింగ్ యార్డు వద్ద సుమారు పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 27,000 అక్రమ మద్యం బాటిళ్లను, 1400 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. అక్రమ మద్యం విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుంది.