Akhil Mahajan IPS : తెలంగాణ రాష్ట్రంలో Green India Challenge నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో సాధారణ ప్రజల నుండి పెద్ద పెద్ద ప్రముఖుల వరకు పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజన్‌ను మంచిర్యాల ఇంఛార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఇంఛార్జి డిసిపి Akhil Mahajan IPS మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక Harithaharam కార్యక్రమం మాదిరిగానే, మొక్కలను మరింత పెంచాలనే ఉద్దేశ్యంతో TRS MP సంతోష్ కుమార్ చేపటిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు.


ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని అఖిల మహాజన్ పెద్దపల్లి డీసీపీ కార్యాలయం ఆవరణంలో మూడు మొక్కలు నాటి వాటితో సెల్ఫీ దిగారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైభవ్ గైక్వాడ్ అడిషనల్ డీసీపీ వరంగల్, గౌష్ ఆలం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ములుగు, భూపాలపల్లి, కిరణ్ కారే ఎస్‌డిపిఓ బైంసాలను ఛాలెంజ్‌లకు నామినేట్ చేస్తున్నట్టు ఇంఛార్జి డీసీపీ వెల్లడించారు.