Akhanda Teaser : బోయపాటి – బాలయ్య కాంబినేషన్లో దద్ధరిల్లే డైలాగులతో అఖండ
హీరో బాలకృష్ణ Akhanda Teaser ఉగాది సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. Akhanda టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ కొత్త లుక్‌లో కనిపించారు.
Akhanda Teaser : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులు, ప్రేక్షకుల అంచ నాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బోయపాటి అందించిన సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ మూవీలు సంచలనం సృష్టించాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో మూడో సారి సినిమా అనౌన్స్ చేయగానే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.


అంచనాలను ముందుగానే ఊహించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను మించేలా బాలకృష్ణతో నూతన సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలను బోయపాటి శ్రీను మరింత పెంచేశారు. BB3 (balayyaboyapati3)అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అపడేట్స్ మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో సినిమా టైటిల్ ఇప్పటి వరకు ఎలా ఉంటుందో తెలియని ఆసక్తిలో అభిమానులు ఉండిపోయారు.
ఈ ఆసక్తికి తెర దించుతూ ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు ధీటుగా టైటిల్‌ను #Akhanda (అఖండ) అని ఖరారు చేశారు. ఉగాది సందర్భంగా టైటిలను బహిరంగ పర్చడంతో పాటు టీజర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇది వరకు విడుదలైన ఓ టీజర్లో హీరో బాలకృష్ణ లుక్ ను మాత్రమే విడుదల చేశారు. ఉగాది సందర్భంగా #Akhanda (అఖండ) టీజర్ లో బాలకృష్ణ మరో కొత్త లుక్ లో కనిపించారు.
ఈ టీజర్లో బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్ తో కనిపించారు. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ధి ..అనే డైలాగ్‌తో చేతిలో త్రిశూళం పట్టుకుని విలన్స్ భరతం పట్టడాన్ని టీజర్ లో చూడొచ్చు. పరమేశ్వరుడికి సంబంధించిన శ్లోకం బ్యాగ్రౌండ్లో వినిపిస్తుంది. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్. తమన్ మరోసారి తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు.


ఈ చిత్రంలో బాలకృష్ణ పక్కన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరో హీరోయిన్ పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతకాంప మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ సినిమాను. మే 28న విడుదల కానుంది.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం