Akhanda Remake: నట సింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. హీరో బాలయ్య నటనతో అఖండ సినిమా అఖండ విజయం సొంతం చేసుకుంది. బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హ్యాట్రిక్ మూవీగా (Akhanda Remake)నిలిచింది.
ఇరువురి కాంబినేషన్లో గతంలో సింహా, లెజెండ్ భారీ విజయం సొంతం చేసుకున్నాయి. అదే స్పీడ్తో వచ్చిన అఖండ సినిమా హిట్ కొట్టి మరో సంచలనం సృష్టించింది. అఖండ మూవీ థియోటర్ల వద్ద రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాలయ్య ఏకంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరిపోయారు. మరో వైపు అఖండ సినిమా OTT లోనూ దూసుకుపోతుంది.
2022 జనవరి 21న అఖండ సినిమా ఓటిటిలో విడుదల చేశారు. OTTలో విడుదలైన 24 గంటల్లోనే సినిమాకు సుమారు 10 లక్షల వ్యూస్ వచ్చాయి.దీంతో అత్యధికంగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది అఖండ. బాలయ్య-బోయపాటి ఆధ్వర్యంలో వచ్చిన ఈ మూవీ అటు వెండితెరపైనే కాకుండా ఇటు ఓటిటిలోనూ అఖండ విజయం సాధించింది.

ఆసక్తి చూపుతున్న ఇతర రాష్ట్ర సినీ పరిశ్రమలు
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు ఇతర భాషల దర్శకత్వ , నిర్మాతలు. ఇప్పటికే బాలీవుడ్లో ఈ సినిమా గురించి ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు అఖండ సినిమాను తమిళంలోకి డబ్బింగ్ చేసి అక్కడ భారీ విజయం అందుకోవాలని చూస్తున్నారట మేకర్స్. ఈ మేరకు సన్నాహకాలు కూడా జరుగుతున్నాయి. రెండు చిత్ర పరిశ్రమల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి తమిళ తంబీలను అఖండ ఏ రేంజ్లో ఆకట్టుకోబోతుందో చూడాలి మరి!.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!