Akbar Birbal Stories: అక్బర్ బీర్బల్ కథలు గురించి తెలుగు లో చదవండి. అక్బర్-బీర్బల్ కథలతో మనకు నీతి బోధిస్తుంది. మనం సమయానుకూలంగా ఎలాగు ఉండాలో, ఆపద వస్తే ఎలా మనకు మనం రక్షించుకోవాలో ఈ కథల ద్వారా తెలుసుకోవచ్చు. అక్బర్-బీర్బల్ కథలు (Akbar Birbal Stories) ఫన్నీగా కూడా ఉంటాయి. వాటిని చదివి అప్పుడప్పు పిల్లలకు కూడా చెప్పవచ్చు.
Akbar Birbal Stories: అక్బర్ బీర్బల్ కథలు
ఒక రోజు Birbal ను ఒక వ్యక్తి రోడ్డుపై అడ్డగించి, ఇలా చెప్పుకొచ్చాడు. మిమ్మల్నే కలవాలని వస్తున్నాను. అలా అనుకున్నానో లేదో ఇలా ప్రత్యక్షమైపయారు. నేను మిమ్మల్ని 20 మైళ్ల దూరం నుండి చూస్తూ వస్తున్నాను..అని అన్నాడు. కలిశారుగా. అంత దూరం నుండి చూడగలరా? చమత్కారంగా అడిగాడు బీర్బల్. మీరు మంచి చతురులే. నేను వచ్చే దారిలో ప్రజలంతా ఈ దేశంలో మీ అంత ఉదారమైన వ్యక్తి మరొకరు లేరని చెప్పుకుంటున్నారు. అని అన్నాడు.
మీరు మళ్లీ అదే దారిన తిరిగి వెనక్కి వెళ్లారుగా అడిగాడు బీర్బల్. అవును అన్నాడు సదరు వ్యక్తి. మీరు నాకు అనుకూలంగా చెప్తారనుకుంటా..అగాడు బీర్బల్. కచ్చితంగా. మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇంతకీ మీ గురించి నేనేమి చెప్పాలి? అడిగాడు ఆ వ్యక్తి. బీర్బల్ ఉదారమైన వ్యక్తి అన్నమాట నా పుకారే!..అని వాళ్లందరికీ చెప్పాలి..అంటూ నడుచుకుంటూ వెళ్లిపోయాడు బీర్బల్.
తన తప్పు తెలుసుకుని, నాలుక కరుచుకుని, ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయోగం చేయకూడదు. ఇంకా నయం ఏ శిక్ష వేయకుండా, నా తప్పు నాకే తెలిసే వచ్చేలా చేశాడు. ఏమైనా మహా తెలివిగలవాడు, అనుకూంటూ వచ్చిన దారినే వెనక్కి మళ్లాడు ఆ వ్యక్తి.
గడ్డంలో గడ్డి పరక
ఒక రోజున Akbar చక్రవర్తి శయనాగారంలోని అల్మారా నుంచి ఖరీదైన ఒక నగను ఎవరో దొంగిలించారు. అక్కడ పనిచేస్తూండే నౌకర్లలో దొంగ ఎవడో తెలుసుకునేదెట్టా? అక్బర్ దొంగను పట్టే పని బీర్బల్‌కు ఒప్పచెప్పాడు. బీర్బల్ నగ పోయిన అల్మారా దగ్గరికి వెళ్లి, దాంట్లో తల దూర్చి, కొంచెం సేపు ఏదో వింటున్నట్టుగా నటించాడు. తరువాత అక్బర్‌కేసి తిరిగి చూసి, ఈ అల్మరా, దొంగను దొరకపుచ్చుకునే మార్గం చెప్పింది.
ఆ నగ దొంగిలించినవాడి గడ్డంలోఒక చిన్న గడ్డి పరక ఉంటుందట..అని అన్నాడు. బీర్బల్ ఇలా అనగానే అక్కడున్న నౌకర్లలో ఒకడు వేళ్లతో గడ్డం సవరించుకున్నాడు. బీర్బల్ వాణ్ణి పట్టుకుని ప్రశ్నించే సరికి, వాడు బెదిరిపోయి దొంగిలించిన నగ తెచ్చియిచ్చాడు.


బీర్బల్ చాతుర్యం
Akbar Birbal Stories: బీర్బల్‌ను ఎలాగైనా మాటలతో ఓడించాలని అక్బర్ అప్పుడప్పుడు సరదాగా ఎత్తులు వేసేవాడు. అయితే బీర్బల్ సమయస్పూర్తితో ఆ ఎత్తులను చిత్తు చేసేవాడు. ఒకసారి అక్బర్‌కి ఒక ఆలోచన వచ్చింది. ఈ సారి బీర్బల్ కచ్చితంగా ఓడిపోతాడు. బీర్బల్ తెల్లమొఖం వేస్తే చూడాలని ఎన్నాళ్ల నుంచో కోరికగా ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరబోతోంది. అనుకుని సంతోషించాడు అక్బర్.
బీర్బల్! నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు దాన్ని తింటావా? అని ఒక రోజు సభాముఖంగా బీర్బల్‌ని అడిగాడు అక్బర్. బాద్ షా! మీ చేతులతో విషం ఇచ్చినా తింటాను అని జవాబిచ్చాడు బీర్బల్. మరోమారు ఆలోచించుకో బీర్బల్! నీకే సందేహంగా అనిపిస్తే తినలేనని ఇప్పుడే చెప్పు. నీకు తెలుసుకదా ఎవరైనా చేస్తానని చెప్పి చేయకపోతే వారికి నేను శిక్ష విధిస్తానని! నవ్వుని అణుచుకుంటూ, లేని గాంభీర్యాన్నితెచ్చుకుంటూ అడిగాడు అక్బర్.
సందేహం ఏమీ లేదు ప్రభూ!. మీ అమృత హస్తాలతో ఏది ఇచ్చినా తింటాను. అన్నాడు బీర్బల్. అక్బర్ ఒక సేవకుడిని పిలిచి రహస్యంగా ఏదో చెప్పి, పళ్లెంలో పెట్టి మరీ తీసుకు రా! అంటూ ఆదేశించాడు. సేవకుడు బతికి ఉన్న కోడిని కంచంలో పెట్టి తీసుకు వచ్చాడు. బీర్బల్! దీన్ని నువ్వు తినాలి అన్నాడు అక్బర్. తప్పకుండా తింటాను ప్రభూ!. ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా చెప్పాడు బీర్బల్.
బీర్బల్ సమాధానంతో అక్బర్ ఆశ్చర్యపోతూ బీర్బల్ నువ్వు శాఖాహారివి కదా!. మాంసాహారం తినడం ఎప్పుడు మొదలు పెట్టావ్? అని అడిగాడు. ప్రభూ! మీరు కోడిని తినమన్నారు. కానీ, ఎలా తినాలో షరుతులు విధించలేదుగా, నేను ఈ కోడిని అమ్ముకుని తింటాను. అని చిన్నగా నవ్వుతూ ఎంతో వినయంగా చెప్పాడు బీర్బల్. అంతే అక్బర్ ఎప్పటిలాగే బీర్బల్ చాత్యుర్యానికి మెచ్చుకోకుండా ఉండలేక, వెళ్లి ఆలింగనం చేసుకున్నాడు. సభలో అందరూ హర్ష ధ్వానాలు చేశారు.