AITUC Trade Union :

AITUC Trade Union : రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

Spread the love
  • అవ‌స‌రం తీరాక కార్మికుల‌ను తొల‌గిస్తారా?
  • అక్ర‌మంగా తొల‌గించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి
  • రాష్ట్ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు యేసుర‌త్నం, మందా వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్

AITUC Trade Union : Hyderabad: మున్సిప‌ల్ రంగంలో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు మున్సిప‌ల్ ఉద్యోగ కార్మిక సిబ్బందిని 60 ఏళ్లు దాటిన వారిని విధుల‌కు వ‌ద్ద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు ఇవ్వ‌డం స‌రికాద‌ని మున్సిప‌ల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. బుధ‌వారం లిబ‌ర్టీ ట్యాంక్ బండ్ ఏరియాలో జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు వ‌ద్ద స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ఏఐటియూసీ కార్యాల‌యంలో గ‌ద్ద‌ల యాద‌య్య అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మున్సిప‌ల్ కార్మిక సంఘం ప‌లు జిల్లాల ముఖ్య స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ (ఏఐటియూసీ) రాష్ట్ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు కె.యేసుర‌త్నం, మందా వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడారు. అక్ర‌మంగా తొల‌గించిన కాంట్రాక్టు ఉద్యోగ కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ప‌ర్మినెంట్ మున్సిప‌ల్ సిబ్బందికి పీఆర్సీ వెంట‌నే ప్ర‌క‌టించి చెల్లించాల‌ని పెండింగ్ లో ఉన్న యూనీఫాం కుట్టుకూలి సొమ్ము చెల్లించాల‌ని అన్నారు.

అధిక వ‌ర్షాలు, అనావృష్టి లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మున్సిప‌ల్ రంగంలో ప‌నిచేయించుకునే ప్ర‌భుత్వానికి ఉద్యోగ కార్మిక సిబ్బంది వ‌య‌స్సు గుర్తుకు రాలేదా? అని ప్ర‌శ్నించారు. పారిశుధ్య కార్మికులు దేవుళ్లు అంటూ సేవ‌లు మ‌రువ‌లేనివి అని పొగిడిన పాల‌కులు మాట‌ల‌కు అర్థం ప‌ర్థం లేద‌ని విమ‌ర్శించారు. ధ‌ర్మాస‌నాలు స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాల‌ని చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదిన చందంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని అన్నారు. తెలంగాణ‌లో ఎంత కాలం వెట్టిచాకిరి బానిస బ‌తుకులు అన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌లు నీటిమీద బుడ‌గ‌లులాగానే మిగిలిపోయాయ‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా మున్సిప‌ల్ కాంట్రాక్టు ఉద్యోగ కార్మిక సిబ్బందికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఉద్యోగ కార్మిక సిబ్బందిని ప‌ర్మినెంట్ చేయాల‌ని, 11వ పీఆర్సీ అమ‌లు చేసి క‌నీస వేత‌నం నెల‌కు రూ.21 వేలు నిర్ణ‌యించి చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఉద్యోగ కార్మిక వ‌ర్గం మ‌రో మారు ఉద్యమ బాట ప‌డ‌తుంద‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప‌లు కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, పుర‌పాల‌క సంఘాల‌లో పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెంచాల‌ని కోరారు. కొత్త‌గా పంచాయ‌తీల నుండి అప్ గ్రేడ్ అయిన మున్సిపాలిటీ, పుర‌పాలక సంఘాల‌లో ప‌నిచేసి స్కేలు జీతాలు పొందిన వారిని స్పెష‌ల్ గ్రేడ్ సిబ్బందిగా గుర్తించి స్కేలు జీతాలు చెల్లించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం పుర‌పాల‌క శాఖ మంత్రి కెటిఆర్ (ఓఎస్‌డి) మహేంద‌ర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ (ఓఎస్‌డి) సి.రాధా, తెలంగాణ రాష్ట్ర క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ ఎన్‌.స‌త్యానారాయ‌ణ‌ల‌కు ఏఐటియుసీ మున్సిప‌ల్ కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో విన‌తిప‌త్రాలు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏఐటియూసీ మున్సిప‌ల్ తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉపాధ్య‌క్షులు కె.జ‌య‌చంద్ర‌, కార్య‌వ‌ర్గ స‌భ్యులు ముడి మార్టిన్‌, నాయ‌కులు రాయ‌పుడి శ్రీ‌నివాస్‌, బి.శ్రీ‌ను, గోపాల్‌, కె.కుమార్‌, విజ‌య‌, ఉష‌య్య‌, న‌ర్సింహులు, జి.అశోక్‌, కిర‌ణ్‌, చంటి, నాగ‌రాజు, నాగ‌మ‌ని త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇది చ‌ద‌వండి:మిస్సైన బంగారం దొంగ‌లు దొరికారు!

ఇది చ‌ద‌వండి: 26న దేశ‌వ్యాప్తంగా బంద్‌కు పిలుపు!

ఇది చ‌ద‌వండి:కిడ్నాప్ నాట‌క‌మాడిన యువ‌తి ఆత్మ‌హ‌త్య

ఇది చ‌ద‌వండి:దెయ్యం భ‌య్యం..కాల‌నీ ఖాళీ చేసిన ప్ర‌జ‌లు

ఇది చ‌ద‌వండి:ష‌ర‌తుల‌పై విర‌సం నేత‌కు బెయిల్ మంజూరు

ఇది చ‌ద‌వండి:కోవిడ్ వ‌ల్లే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుద‌ల

ఇది చ‌ద‌వండి:ఖాకీ మాటున మాన‌వ‌త్వాన్ని చూపిన ప్ర‌తి పోలీసుకు సెల్యూట్: డీజీపీ

Chalo Khammam Collectorate: క‌నీస వేత‌నాల పెంపుద‌ల‌కై ఖ‌మ్మం కార్మిక సంఘాల నేత‌లు ఉక్కుపాదం!

Chalo Khammam Collectorate: ఖ‌మ్మం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, గార్డెన్, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్స్ Read more

Provident Fund : పుట్టిన తేదీకి కార్మికుల PF కు లింక్ పెడ‌తారా?

Provident Fund : పుట్టిన తేదీకి కార్మికుల PF కు లింక్ పెడ‌తారా? ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు : మున్సిప‌ల్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. Read more

Leave a Comment

Your email address will not be published.